https://oktelugu.com/

Vastu Tips : వాస్తు టిప్స్: ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండాలంటే ఏం చేయాలో తెలుసా?

ఇంట్లో బద్ధకంగా గడిపే వారుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు. అందరు విధిగా ఎవరి పనులు వారు చేసుకుంటేనే ఆమెకు ఇష్టం. శుభ్రమైన ప్రదేశాల్లోనే లక్ష్మీదేవి కొలువుంటుంది. లేకపోతే ఉండటానికి ఇష్టపడదు. ఇంటి పరిసరాలు సరిగా లేకపోయినా సిరి ఉండదు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 28, 2023 / 05:13 PM IST
    Follow us on

    Vastu Tips : జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అందరు ఆశిస్తారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ కొందరు చేసే తప్పుల వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో నిలవదు. దీంతో దారిద్ర్యమే తాండవిస్తుంది. మన ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే మనం కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవాలి. అప్పుడే ఆమె మన ఇంట్లోకి వస్తుంది. మనం కొన్ని చేయరాని తప్పులు చేస్తే మాత్రం ఆమె మన గడప తొక్కకుండానే వెళ్లిపోతుంది. లక్ష్మీదేవి రాక కోసం మన చేయకూడని తప్పులు ఏంటో తెలుసా.

    ఇంట్లో బద్ధకంగా గడిపే వారుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు. అందరు విధిగా ఎవరి పనులు వారు చేసుకుంటేనే ఆమెకు ఇష్టం. శుభ్రమైన ప్రదేశాల్లోనే లక్ష్మీదేవి కొలువుంటుంది. లేకపోతే ఉండటానికి ఇష్టపడదు. ఇంటి పరిసరాలు సరిగా లేకపోయినా సిరి ఉండదు. ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగైతేనే లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది.

    చాలా మంది ఇతరుల ఎదుగుదలను ఓర్చుకోలేరు. అసూయ పడుతుంటారు. అలాంటి వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. ఇతరుల మీద ద్వేషం పెంచుకోకూడదు. మనం కూడా ఎదగాలని ఆశపడటంలో తప్పులేదు. డబ్బు మోసం చేసి సంపాదించే వారి ఇంట్లో కూడా స్థిరంగా ఉండదు. మోసపూరితంగా సంపాదించే వారి ఇంట్లో కనకం ఉండదు.

    ఇంట్లో పిల్లలు, స్త్రీలు, ముసలివారు మంచి స్థానాల్లో ఉంటే లక్ష్మీదేవి తాండవిస్తుంది. స్త్రీల పట్ల అనుచిత ప్రవర్తన కలిగిన కుటుంబాలు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటాయి. ముసలి వారికి సముచిత గౌరవం ఇస్తే ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది. ఇంట్లో ఉండే పెద్దవారి పట్ల గౌరవ మర్యాదలు ఉంటేనే మంచిది. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.