Chanakya Neethi : మనం జీవితంలో కొంత మందిని నమ్ముతుంటాం. కొంతమందికి దగ్గరగా ఉంటాం. కానీ అందరిని నమ్మలేం. జీవితంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఆచార్య చాణక్యుడు సూచించాడు. ఎటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. స్వార్థపరులకు దగ్గరగా ఉంటే ఏం జరుగుతుందనే విషయాలు చాణక్యుడు వివరించాడు. కోపంతో ఉండే వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిది.
స్వార్థంతో..
స్వార్థంతో ఉండే వారిని దూరంగా ఉంచితేనే మంచిది. ఎందుకంటే వారి స్వప్రయోజనాల కోసమే పనిచేస్తారు. ఇతరుల గురించి పట్టించుకోరు. ఆపదల సమయంలో కూడా వారి గురించే ఆలోచిస్తారు. కానీ ఇతరుల బాధలకు ప్రాధాన్యం ఇవ్వరు. అందుకే వారిని దూరంగా ఉంచడమే శ్రేయస్కరం. అలాంటి వారిని నమ్మకుండా మన పని మనం చేసుకోవడం ఉత్తమం.
కోపంతో..
కోపంతో ఉండే వారికి కూడా దూరంగా ఉండాలి. వారు విచక్షణ కోల్పోయి మాట్లాడతారు. బూతు పురాణం అందుకుంటే ఇక ఎవరి మాట వినరు. అందుకే అలాంటి వారిని కూడా దూరంగా పెట్టడమే అన్ని విధాలా మంచిది. వీరి వల్ల మనకు ఉన్న విలువ కూడా పోతుంది. వీరు గట్టిగా పరుష పదజాలం వాడుతుంటే అందరు మనల్నే చూస్తారు. వీరికి దూరంగా నిలవడమే మనం చేయాల్సిన పని.
పొగిడే వారిని..
ముందు పొగిడే వారు వెనక తిడుతుంటారు. వీరి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. కడుపులో కత్తులు నోట్లో బెల్లాలు అంటారు. ముందు మాత్రం నీవు తోపువు అంటారు. మనం లేనప్పుడు వాడో వేస్టుగాడంటూ బిరుదు ఇస్తారు. ఇలాంటి వారి పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండకపోతే మనమే చిక్కుల్లో పడతాం. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ లక్షణాలు ఉన్న వారి వెంట ఉండకండి. సమస్యలు కొని తెచ్చుకోకండి.