https://oktelugu.com/

Cauliflower: ఈ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే క్యాలీఫ్లవర్ జోలికి అసలు పోవద్దు!

క్యాలిఫ్లవర్ ఆరోగ్యానికి మంచిదైనా కూడా అతిగా తినకూడదు. అయితే ఏ సమస్యలు ఉన్నవారు క్యాలిఫ్లవర్ తినకూడదు? క్యాలిఫ్లవర్ తినడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో మరి తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 27, 2024 9:07 pm
    Cauliflower

    Cauliflower

    Follow us on

    Cauliflower: సీజన్ బట్టి మార్కెట్లో కూరగాయలు వస్తుంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తప్పకుండా అన్ని రకాల కూరగాయలను తింటుంటారు. ఈ సీజన్‌లో ఎక్కువగా క్యాలిఫ్లవర్ మార్కెట్లో లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో బాగా ఉపయోగపడతాయి. అయితే అన్ని రకాల కూరగాయాలు అందరు తినరు. కొందరికి క్యాలిఫ్లవర్ ఆరోగ్యానికి మేలు చేసిన మరికొందరికి మాత్రం అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ ఈ విషయం తెలియక అందరూ కూడా క్యాలిఫ్లవర్‌ను తినేస్తారు. క్యాలిఫ్లవర్‌లో విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్నా కూడా కొందరికి అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. తెలియకుండా కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల లేని పోని అనారోగ్య సమస్యలను మనమే కోరి తెచ్చుకున్నట్లు అవుతాం. క్యాలిఫ్లవర్ ఆరోగ్యానికి మంచిదైనా కూడా అతిగా తినకూడదు. అయితే ఏ సమస్యలు ఉన్నవారు క్యాలిఫ్లవర్ తినకూడదు? క్యాలిఫ్లవర్ తినడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో మరి తెలుసుకుందాం.

    గ్యాస్, ఉబ్బరం సమస్య ఉన్నవారు
    అధికంగా క్యాలీఫ్లవర్ తినడం వల్ల గ్యాస్ట్రిక్, అసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్యాలీఫ్లవర్‌లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను పెంచుతాయి. కాబట్టి క్లాలిఫ్లవర్‌ను ఎక్కువగా తినవద్దు. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు అయితే అసలు వీటి జోలికి వెళ్లకపోవడం మంచిది.

    థైరాయిడ్ ఉన్నవారు క్యాలీఫ్లవర్ తినకూడదు
    కొందరికి థైరాయిడ్ ఉంటుంది. అలాంటి వారు అసలు క్యాలీఫ్లవర్ జోలికి పోకూడదు. దీనిని తినడం వల్ల థైరాయిడ్ సమస్య ఇంకా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాలీఫ్లవర్ తినడం థైరాయిడ్ గ్రంధిలో అయోడిన్‌ సామర్థ్యం తగ్గుతుంది. దీనివల్ల సమస్య తీవ్రతరం అవుతుంది. క్యాలీఫ్లవర్‌ను ఏ విధంగా కూడా థైరాయిడ్ సమస్య ఉన్నవారు అసలు తీసుకోవద్దు. వీటిని తీసుకుంటే తప్పకుండా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.

    కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉన్నవారు
    కిడ్నీలో కొందరికి రాళ్లు ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు అసలు క్యాలీఫ్లవర్ జోలికి వెళ్లకపోతేనే మంచిది. క్యాలీఫ్లవర్‌లో క్యాల్షియం ఉంటుంది. ఇది కీడ్నీలో రాళ్ల సమస్యను మరింత పెంచుతుంది. కానీ తగ్గించదు. కాబట్టి స్టోన్ సమస్యలు ఉన్నవారు వీటిని తినవద్దు. కిడ్నీలో ఉండే రాళ్లను కరిగించే ఫుడ్స్ తీసుకోవాలి. అంతే కానీ రాళ్లను ఇంకా పెంచే ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇంకా అనారోగ్య సమస్యలు పెరుగుతాయి.

    గర్భధారణ దాల్చిన వారు
    గర్భిణులు క్యాలీఫ్లవర్‌ను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తినడం వల్ల గర్భదారణ సమయంలో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఈ సమయంలో మహిళలు కాస్త జాగ్రత్తగా ఉంటేనే మంచిది. లేకపోతే గర్భధారణ సమయంలో ఇంకా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.