https://oktelugu.com/

Youth: ఉద్యోగం వదిలి వ్యాపారం.. అక్కడా చేతులు కాల్చుకుని.. తిప్పలు పడుతున్న యువత..

ఉద్యోగం చేయడం కన్నా సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తే ఆ దర్జా వేరే ఉంటుందనే భావన కొందరిలో ఉంటుంది. అంతేకాకుండా శక్తికి తగిన విధంగా డబ్బు సంపాదించుకోవచ్చని అనుకుంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : October 28, 2024 / 02:00 AM IST

    Youth

    Follow us on

    Youth: మంచి జీవితం ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అనుకున్న విధంగా జీవితం సాగాలంటే ఏదో ఒక పని చేయాలి. అది ఉద్యోగం అయినా సరే.. వ్యాపారం అయినా సరే.. ఉద్యోగం చేయాలనుకునేవారు మంచి జీతం పొందాలంటే తగిన చదువు ఉండాలి. చదువు కాస్త అటూ ఇటూ ఉన్న వారు వ్యాపారంలోకి అడుగుడపెడుతారు. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది ఉద్యోగాలు చేసేవారు సైతం ఒకరి కింద పనిచేయడం కన్నా సొంతంగా వ్యాపారం చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇతరుల వద్ద అప్పులు చేసి లేదా బ్యాంకు రుణ సాయంతో వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ చాలా మంది యువకులు వ్యాపారంలో అడుగుపెట్టి ఆ తరువాత చేతులు కాల్చుకుంటున్న సంఘటనలు ఎదురవుతున్నాయి. అందులోనూ ఇటీవల సొంతంగా వ్యాపారం చేయాలనుకునేవారు ఎక్కువగా ప్రాంచైజీలను తీసుకుంటున్నారు. కానీ ఇవి కూడా అంతగా లాభాలు తేవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరుగుతుందంటే?

    ఉద్యోగం చేయడం కన్నా సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తే ఆ దర్జా వేరే ఉంటుందనే భావన కొందరిలో ఉంటుంది. అంతేకాకుండా శక్తికి తగిన విధంగా డబ్బు సంపాదించుకోవచ్చని అనుకుంటున్నారు. లక్ తగిలితే తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది. స్వేచ్ఛగా పెట్టుబడులు పెడుతూ వినియోగదారులను ఆకట్టుకుంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. అయితే చాలా మంది తక్కువ పెట్టుబడితో బిజినెస్ స్టాట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. వీటిలో టీ స్టాల్ తో పాటు టిఫిన్ సెంటర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఫుడ్ బిజినెస్ కు మార్కెట్లో ఎక్కువడా డిమాండ్ ఉండడంతో వీటిని స్టార్ట్ చేస్తున్నారు.

    అయితే కొందరు టిఫిన్ సెంటర్లు స్ట్రాట్ చేసిన తరువాత వారికి వచ్చే లాభాలను చూసి మరికొందరు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు. కానీ అన్ని వేళలు ఒకే విధంగా ఉండయని గుర్తించాలి. టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసే ముందు లోకేషన్ గుర్తించాలి. అలాగే జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలి. వీటికంటే ముఖ్యంగా ఫుడ్ క్వాలిటీపై దృష్టి పెట్టాలి. అప్పుడే టిఫిన్ సెంటర్లు సక్సెస్ అవుతాయి. అయితే చాల మంది ఆడంబరంగా టిఫిన్ సెంటర్లు స్ట్రాట్ చేసి క్వాలిటీ గురించి పట్టించుకోవడం లేదు. దీంతో ఒక్కసారి వీటి నుంచి కస్టమర్లు దూరమైన తరువాత తిరిగి రావడం లేదు.

    ప్రస్తతం సెల్ఫ్ ఎంప్లాయి కంటే ప్రాంచైజీలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. కొన్ని కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి ఆయా ప్రాంతాల్లో ఔట్ లెట్స్ ను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఉత్సాహ వంతుల నుంచి పెట్టుబడులను సేకరిస్తుంది. అయితే సొంతంగా కంటే ఇలా ప్రాంచైజీలను ఏర్పాటు చేయడం ద్వారా మెటీరియల్, ఫర్నీచర్ అంతా కంపెనీ నుంచే వస్తుంది. దీంతో కాస్త రిస్క్ తక్కువగా ఉంటుందని చాల మంది వీటిని ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇవి వినియోగదారులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అంతేకాకుండా క్వాలిటీ విషయం పట్టించుకోకపోవడంతో ఇవి ఫెయిల్ అవుతున్నాయి.

    ఈ క్రమంలో చాలా మంది యువకులు ఇలా పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకుంటున్నారు. అయితే వ్యాపారం ప్రారంభించే ముందు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తే దానిపై పూర్తిగా అవగాహన ఉండాలి. ఇతరులతో చేయడం వల్ల వారికి ఇచ్చే జీతాలు సరిపోవు. అంతేకాకుండా ఒక వ్యాపారం కనీసం ఏడాది పాటు అయినా నిర్వహించేలా మూలధనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వ్యాపారాలు సక్సెస్ కావడానికి చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా బ్యాంకు రుణం కంటే సొంతంగా మూలధనం ఉంటే మాత్రమే వ్యాపారాన్ని ప్రారంభించాలి. లేకుంటే రుణంపై వడ్డీలు కట్టడానికే డబ్బులు దొరకవు.