Expensive Films Than Chandrayaan 3: ఈ తెలుగు చిత్రాల బడ్జెట్స్ చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ ఖర్చు కంటే ఎక్కువని తెలుసా?

చంద్రుడి మీద ప్రయోగాల్లో భాగంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇస్రోకి అయిన ఖర్చు కేవలం రూ. 615 కోట్లు. ఇతర దేశాలు ఇదే ప్రయోగం చేపట్టాలంటే వేల కోట్లు అవుతుంది. ఇస్రో అనుసరిస్తున్న విధానం, సాంకేతిక పద్ధతులు తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలకు తోడ్పడుతుంది. ఇది ఆదిపురుష్, ఆర్ ఆర్ ఆర్, ప్రాజెక్ట్ కే చిత్రాల బడ్జెట్ కంటే తక్కువ.

Written By: Shiva, Updated On : July 18, 2023 8:47 am

Expensive Films Than Chandrayaan 3

Follow us on

Expensive Films Than Chandrayaan 3: దేశంలోనే అతిపెద్ద పరిశ్రమగా అవతరించింది టాలీవుడ్. అందుకు రాజమౌళి కారణం అనడంలో సందేహం లేదు. సినిమాలో విషయం ఉంటే భాషాబేధం లేకుండా ఆదరిస్తారని ఆయన బాహుబలి చిత్రాలతో నిరూపించారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆ నమ్మకాన్ని మరింత బలపరిచారు. బాహుబలి అనంతరం టాలీవుడ్ పరిధి పెరిగింది. తెలుగు సినిమాలు బాగుంటాయనే ఆలోచన ఇండియన్ ఆడియన్స్ లో డెవలప్ అయ్యింది. ప్రభాస్ సాహో సౌత్ లో నిరాశపరిచినా… హిందీలో కుమ్మేసింది. రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఇక ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. పుష్ప, కార్తికేయ 2 వంటి చిత్రాలు ఇండియా వైడ్ ఆదరణ దక్కించుకున్నాయి. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోలు చేస్తున్న చిత్రాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నాయి. ఒక్కో చిత్ర బడ్జెట్ రూ. 300 కోట్లకు పైమాటే. కాగా కొన్ని చిత్రాల బడ్జెట్స్ చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కాస్ట్ కంటే ఎక్కువ కావడం ఆశ్చర్యం గొలిపే విషయం.

చంద్రుడి మీద ప్రయోగాల్లో భాగంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇస్రోకి అయిన ఖర్చు కేవలం రూ. 615 కోట్లు. ఇతర దేశాలు ఇదే ప్రయోగం చేపట్టాలంటే వేల కోట్లు అవుతుంది. ఇస్రో అనుసరిస్తున్న విధానం, సాంకేతిక పద్ధతులు తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలకు తోడ్పడుతుంది. ఇది ఆదిపురుష్, ఆర్ ఆర్ ఆర్, ప్రాజెక్ట్ కే చిత్రాల బడ్జెట్ కంటే తక్కువ.

ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి మొదట రూ. 400 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. లాక్ డౌన్ కారణంగా విడుదల ఆలస్యమైంది. అలాగే రాజమౌళి ప్రమోషన్స్ కోసం భారీగా ఖర్చు చేశారు. ఆస్కార్ క్యాంపైన్ లో భాగంగా అమెరికాలో నెలల తరబడి ఉన్నారు. మొత్తం ఖర్చులు కలుపుకుంటే ఆర్ ఆర్ ఆర్ బడ్జెట్ రూ. 650 కోట్లకు పై మాటే అంటున్నారు. ఇక ఆదిపురుష్ చిత్ర బడ్జెట్ రూ. 500 కోట్లు. టీజర్ విమర్శలకు గురికావడంతో 2024 జనవరిలో విడుదల కావాల్సిన చిత్రాన్ని జూన్ 16కి వాయిదా వేశారు. మరో రూ. 100 కోట్లు అదనంగా ఖర్చు చేశారు. ఆదిపురుష్ చిత్ర టోటల్ బడ్జెట్ రూ. 700 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.

ప్రభాస్ నటిస్తున్న మరో భారీ చిత్రం ప్రాజెక్ట్ కే. సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతుంది. కమల్ హాసన్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని వంటి స్టార్ క్యాస్ట్ భాగమయ్యారు. వీరందరి రెమ్యూనరేషన్స్ రూపంలో రూ. 200 కోట్లు ఖర్చవుతుంది. మొత్తంగా ప్రాజెక్ట్ కే బడ్జెట్ రూ. 700 కోట్లు దాటనుంది అంటున్నారు. కాబట్టి ఇస్రో ఒక తెలుగు సినిమా బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో అద్భుతాలు చేస్తుంది. అవతార్ లాంటి చిత్ర బడ్జెట్ తో ఇస్రో ఓ పది ప్రయోగాలు చేపట్టగలదు.