Thyroid: థైరాయిడ్ ప్రస్తుతం రోజుల్లో ఒక సర్వసాధారణ సమస్యగా ఏర్పడింది. ఈ సమస్యపై ప్రజల్లో ఎన్నో సందేహాలు, అపోహలు కూడా ఉన్నాయి. మరి థైరాయిడ్ పూర్తిగా నయం అవుతుందా? దీన్ని ఎలా నివారించాలి? అనే సందేహాలు ఎప్పుడు ప్రజలను వెంటాడుతూనే ఉంటాయి. ఇక థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పని చేయకపోతే, అది ఉత్పత్తి చేసే థైరాయిడ్ హార్మోన్ చాలా ఎక్కువ లేదా చాలా తక్కువగా ఉంటే థైరాయిడ్ సమస్య వస్తుంది. ఈ సమస్యతో బాధపడే వ్యక్తి వేగంగా బరువు కోల్పోతారు.
థైరాయిడ్ ఉన్నవారు పానీయాల విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇంతకీ థైరాయిడ్ పూర్తిగా నయం అవుతుందా లేదా అనే వివరాలు కూడా తెలుసుకుందాం. థైరాయిడ్ ను పూర్తిగా నయం చేయలేము అంటున్నారు డాక్టర్లు. మందులు, జీవనశైలి మార్పుల సహాయంతో దీన్ని నియంత్రించవచ్చట. ఇక థైరాయిడ్ తో బాధపడే వారు ఒత్తిడికి చాలా దూరంగా ఉండాలి. మానసిక, శారీరక ఒత్తిడి వల్ల శరీరంలో మంట పెరుగుతుందట. ఒత్తిడి తొలిగిపోవాలంటే ధ్యానం చేయాలి.
పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి. ఆహారంలో కాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, అయోడిన్ వంటివి ఉండాలి. వీటి వల్ల థైరాయిడ్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు విటమిన్ ఏ, బి, సి అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజూ వ్యాయామం చేయడం వల్ల థైరాయిడ్ ను నియంత్రించే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు. ప్రతి రోజు కాస్త వ్యాయామం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. దీని వల్ల థైరాయిడ్ కూడా నియంత్రణలో ఉంటుంది.
శరీరం జీవక్రియను మెరుగుపరుస్తుంది. థైరాయిడ్ రుగ్మతలను పెంచుతుంది వ్యాయామం. బరువును అదుపులో ఉంచుతుంది. ఇక ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. వీటితో పాటు సిగరెట్లు మానేయడం, విటమిన్ డి పుష్కలంగా తీసుకోవడం వంటివి థైరాయిడ్ ను నివారించవచ్చు.