Best Sales Car: 50 లక్షల సేల్స్ ను సొంతం చేసుకున్న కారు ఏదో తెలుసా?

2000 సంవత్సంలో ఆల్టో మార్కెట్లోకి వచ్చిన తరువాత 17 ఏళ్ల పాటు దీని విక్రయాలు నిరంతరాయంగా కొనసాగాయి. ఆ తరువాత లేటేస్ట్ కారును తీసుకురావాలనే ఉద్దేశంతో నేటి యువతను ఆకర్షించే విధంగా ఆల్టో కే 10 ను 2010లో తీసుకువచ్చారు.

Written By: Chai Muchhata, Updated On : April 29, 2024 4:30 pm

AltoModelImage

Follow us on

Best Sales Car:  కారు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. కానీ అనుగుణంగా బడ్జెట్ ఉన్నవారు మాత్రమే 4 వెహికల్ ను సొంతం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో మారుతికి చెందిన కార్లకు ఎక్కువగా డిమాండ్ ఏర్పడుతోంది. సామాన్యులకు సైతం సరసమైన ధరల్లో కారు అందిచేలా ఈ కంపెనీ వివిధ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తుంది. దీంతో అన్ని వర్గాల వారు మారుతి కార్లు అంటే లైక్ చేస్తారు. అయితే ఈ కంపెనీకి చెందిన ఓ కారు లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక సేల్స్ ను సొంతం చేసుకుంది. ఏకంగా 50 లక్షల టార్గెట్ ను రీచ్ చేసిందంటే ఎవరైనా నమ్ముతారా? ఆ వివరాల్లోకి వెళితే..

భారత్ లో అత్యధికంగా అమ్ముడుపోతున్న కార్లు ఏవంటే ముందుగా మారుతికి చెందిన వ్యాగన్ ఆర్, హ్యుందాయ్ ఐ 10 తదితర కార్లు పేర్లు చెబుతున్నారు. కానీ మారుతి నుంచి రిలీజ్ అయిన కొన్ని మోడళ్లు బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో పడిపోయాయి. వాటిలో గతంలో మారుతి సుజుకి 800 ఉండేది. కానీ ఆ తరువాత ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఆల్టో కారును వినియోగదారులు విపరీతంగా ఆదరించారు. 2000 సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చిన ఆల్టో కారు ఇప్పటి వరకు 50.60 లక్షల కార్లు అమ్ముడుపోుయాయి. ఈ రికార్డును ఇతర కార్లు బ్రేక్ చేస్తాయా? అంటే చెప్పలేమని కొందరు అంటున్నారు.

2000 సంవత్సంలో ఆల్టో మార్కెట్లోకి వచ్చిన తరువాత 17 ఏళ్ల పాటు దీని విక్రయాలు నిరంతరాయంగా కొనసాగాయి. ఆ తరువాత లేటేస్ట్ కారును తీసుకురావాలనే ఉద్దేశంతో నేటి యువతను ఆకర్షించే విధంగా ఆల్టో కే 10 ను 2010లో తీసుకువచ్చారు. ఆ తరువాత 2023 మార్చిలో మారుతి సుజుకీ హ్యాచ్ బ్యాక్ కారు ఆల్టో 800 ఉత్పత్తిని నిలిపివేసింది. బీఎస్ 2 ప్రమాణాలకు అనుగుణంగా ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్ కారు ఫీచర్లు అప్ గ్రేడ్ చేయడానికి దీనికి పెట్టుబడులు పెట్టడం సరైంది కాదని భావించారు. దీంతో ఆల్టో 800 ఉత్పత్తి మార్కెట్లోకి రాకుండా ఆగిపోయింది.

ప్రస్తుతం మార్కెట్లో ఆల్టో కే 10 మోడల్ తన హవా సాగిస్తోంది. ఈ మోడల్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 67 పీఎస్ పవర్, 89 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో పాటు 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తుంది. ఇందులో సీఎన్ జీ ఆప్షన్ కూడా ఉంది. ఈ కారును రూ.3.99 లక్షల ప్రారంభం నుంచి రూ.5.96 వరకు విక్రయిస్తున్నారు. ఇది రెనాల్ట్ క్విడ్ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తోంది.