Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj : అమ్మా ఏంటా డ్రెస్... అనసూయ పొట్టి బట్టలపై కొడుకు సీరియస్... షాకింగ్...

Anasuya Bharadwaj : అమ్మా ఏంటా డ్రెస్… అనసూయ పొట్టి బట్టలపై కొడుకు సీరియస్… షాకింగ్ మేటర్ వెలుగులోకి!

Anasuya Bharadwaj : అనసూయ డ్రెస్సింగ్ ఒక వివాదాస్పద అంశం. ఈ కారణంగా నిత్యం ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. తనపై నెగిటివ్ కామెంట్స్ చేసేవారికి అనసూయ గట్టిగానే కౌంటర్లు ఇస్తుంది. నా బట్టలు నా ఇష్టం .. నాకు సౌకర్యంగా ఉంది వేసుకుంటున్నాను. అడగడానికి మీరెవరని పలుమార్లు ఘాటుగానే జవాబిచ్చింది. అయితే తాజా ఇంటర్వ్యూలో తాను పొట్టి బట్టలు ధరించడం తన కొడుక్కి ఇష్టం లేదని సంచలన మేటర్ లీక్ చేసింది.

అనసూయ మాట్లాడుతూ .. నేను పొట్టి బట్టలు వేసుకోవడం నా పెద్ద కొడుక్కి నచ్చదు. పొట్టిగా ఉండే క్రాప్ టాప్, ఇంకేదైనా డ్రెస్ వేసుకుంటే .. మమ్మీ ఏంటా డ్రెస్ .. పెద్ద డ్రెస్ వేసుకోవచ్చు కదా అని అడిగేస్తాడు. అప్పుడు నేను ఒకటే సమాధానం ఇచ్చా. డ్యూడ్ ఇవి నా బట్టలు నా ఇష్టం. నువ్వు వేసుకునే అవెంజర్స్ టీ షర్ట్ నాకు నచ్చదు. కానీ నీకు ఇష్టం అని ఒప్పుకున్న. నేను కూడా అంతే నాకు ఇష్టమైన బట్టలు వేసుకుంటా అని చెప్పాను.

నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా మా పేరెంట్స్ ఎలాంటి బట్టలు వేసుకోమంటే అవే వేసుకునేదాన్ని. వాళ్ళని నేను తప్పుబట్టడం లేదు. మా అమ్మ నాన్న పెంపకం వల్లే నాకు విలువలు తెలిసాయి. నేను పద్దతిగా పెరగడం వల్లే నా శరీరాన్ని దేవాలయంగా భావిస్తాను. పడుకొని సంపాదించే సంపాదనపై నాకు ఇష్టం లేదు. అలాంటివి నా జీవితంలో అస్సలు జరగవు. అలాంటివి ఒప్పుకోకపోవడం వల్లే కొన్ని అవకాశాలు వదులుకోవాల్సి వచ్చింది.

ఇలాంటివి ఫిలిం ఇండస్ట్రీ లోనే కాదు చాలా చోట్ల అలాగే ఉందని అనసూయ చెప్పుకొచ్చింది. కాగా అనసూయ బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి పూర్తిస్థాయి నటిగా మారిపోయింది. అటు ప్రొఫెషనల్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ చక్కగా బ్యాలెన్స్ చేస్తూ సమయం దొరికినప్పుడు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం పుష్ప 2 తో పాటు మరో రెండు, మూడు సినిమాల్లో ఆమె నటిస్తున్నారు. అనసూయ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది.

Exit mobile version