Curd Benefits: మనలో చాలా మందికి పెరుగు తినే అలవాటు ఉంటుంది. పెరుగులో మనకు ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదే. రాత్రి పూట పెద్ద మొత్తంలో కాకుండా కొంచెం పెరుగు తింటే మంచిది. పొద్దంతా పెరుగు తింటే ఎలాంటి నిబంధనలు ఉండవు. పెరుగులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే పెరుగు తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదే.
ఇందులో ఏముంటాయి?
పెరుగులో కాల్షియం, విటమిన్ బి2, పొటాషియం, మెగ్నిషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో ఉండే ప్రొబయోటిక్ వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పెరుగు మన కడుపు, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో గుడ్ బ్యాక్టీరియా ఉండటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఒక రోజు పులియబెట్టిన పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉండటం వల్ల మనకు ఎంతో మేలు కలిగిస్తుంది.
రోగనిరోధక శక్తి
రోజు పెరుగు తినడం వల్ల రోగ నిరోదక శక్తి పెరుగుతుంది. తుమ్ములు, జలుబు, జ్వరం వంటివి రాకుండా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగు తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం నుంచి కూడా రక్షించుకోవచ్చు. మధుమేహానికి కూడా పెరుగు ఔషధంలా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు సహకరిస్తుంది.
రక్తపోటు నియంత్రిస్తుంది
పెరుగు తినడం వల్ల అధిక రక్తపోటు కూడా కంట్రోల్ లో ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉండటంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. కాల్షియం ఉండటం వల్ల ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. ఉదయం పూట తీసుకోవడం వల్ల మన శరీరం ఎనర్జిటిక్ గా మారుతుంది. బరువు పెరిగేందుకు కూడా ఇది దోహదం చేస్తుంది.
మొటిమల నివారణకు..
పెరుగుతో మొటిమలను నివారించుకోవచ్చు. ఒక టీ స్పూన్ కాపీ పొడిలో చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత కడుక్కుంటే మొటిమలు మాయమవుతాయి. పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజు తినడం వల్ల మనకు మేలు కలుగుతుంది.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Can curd be eaten daily what happens if you eat it
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com