Donald Trump : ఎన్నికల ప్రచారంలో ట్రంప్ అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా పౌరసత్వం కల్పించడం అందులో ప్రధానమైనది.. అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన నేపథ్యంలో.. అమెరికా పౌరసత్వాన్ని కల్పించే విషయంపైనే తొలి నిర్ణయం తీసుకుంటారని చర్చ జరుగుతోంది. ఎందుకంటే వలస విధానం పై మొదటి నుంచి ట్రంప్ ఆగ్రహం గానే ఉన్నారు. ఆ నిర్ణయం సరికాదని ఆయన పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. పలు వేదికలపై తన వైఖరిని వెల్లడించారు. దీంతో అమెరికాలో పుట్టినప్పటికీ.. తమ పిల్లలకు పౌరసత్వం దక్కే విషయంలో చాలామంది తల్లిదండ్రులకు అనిశ్చితి ఏర్పడింది. అమెరికాలో జన్మించిన చిన్నారులకు జన్మతానే అక్కడి పౌరసత్వం లభిస్తుంది. దీనిని అమెరికన్ పరిభాషలో నేచురలైజేడ్ సిటిజెన్షిప్ అంటారు. అయితే దానిని తాను గెలిచిన మొదటి రోజే ఎత్తేస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఇదే విషయాన్ని రిపబ్లిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కాండిడేట్ జెడి వాన్స్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ” వచ్చే కాలంలో అమెరికాలో పుట్టే చిన్నారులకు న్యాచురల్ సిటిజెన్షిప్ దక్కాలి అంటే.. వారి పేరెంట్స్ లో ఒక్కరైనా కచ్చితంగా అమెరికా సిటిజన్స్ అయి ఉండాలి. లేదా చట్ట ప్రకారం అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్స్ అయి ఉండాలనే ఆదేశాలు ఇస్తున్నామని” ట్రంపు ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు. ప్రచారంలో ట్రంప్ చెప్పినట్టు నిర్ణయానికి తీసుకుంటే.. ఇకపై అమెరికాకు వలస వెళ్లే వారే పిల్లలకు నేచురలైజ్డ్ సిటిజెన్షిప్ లభించదు.
వారికి వరాలు
ఇక ఎన్నికల ప్రచారంలో తనకు అండదండలు అందించిన వారిపై ట్రంప్ వరాలు కురిపిస్తున్నారు. ట్రంప్ ఎన్నికల ప్రచార సారధిగా వ్యవహరించిన సూసి వైల్స్ జాక్ పాట్ కొట్టారు. ఆమె ఏకంగా వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమితులయ్యారు. ట్రంప్ విజయం సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించారని.. అందువల్లే ఆమెకు గొప్ప పదవి లభించిందని అమెరికన్ మీడియా వ్యాఖ్యానిస్తోంది. అయితే ఇటీవల ట్రంప్ గెలిచిన తర్వాత విజయ ప్రసంగం చేశారు. ఆ సమయంలో మాట్లాడాలని కోరినప్పటికీ సూసి ఒప్పుకోలేదు. ట్రంప్ ఇచ్చిన ఆఫర్ ను అత్యంత సున్నితంగా తీరస్కరించారు. సూసి స్వస్థలం ఫ్లోరిడా. ఆమె చాలా సంవత్సరాల నుంచి రిపబ్లికన్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. 2016, 2020 సంవత్సరాలలో ఆమె ట్రంప్ కు సంబంధించి ప్రచార బాధ్యతలను స్వీకరించారు. ఆమె గతంలో యూటా మాజీ గవర్నర్ జాన్ హంట్స్ మన్ 2012 లో అధ్యక్ష ప్రచారంలో మేనేజర్ గా కొనసాగారు.. సూసి మాత్రమే కాకుండా తన విజయంలో ముఖ్యపాత్ర పోషించిన వారందరికీ ట్రంప్ భారీ ఆఫర్లు ఇస్తున్నారు. మొత్తంగా వైట్ హౌస్ ను రిపబ్లికన్ పార్టీ నాయకులతో నింపేశారు. కీలక పదవులు మొత్తం ఆ పార్టీకి చెందిన వారికి ఇచ్చేశారు. దీంతో ఇంకో 45 రోజులకు మించి పదవి కాలం ఉన్నప్పటికీ.. బైడన్ కాస్తా రబ్బర్ స్టాంప్ అయిపోయారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Naturalized citizenship is no longer available to the children of immigrants to the united states
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com