https://oktelugu.com/

Pimples: మొటిమలు విటమిన్ లోపం వల్ల వస్తాయా? ఇంతకీ ఏం చేయాలంటే..

అదనపు జిడ్డు వల్ల మృతకణాలు బ్యాక్టీరియా చర్మరంధ్రాలలో పేరుకొనిపోయి మొహం మీద మొటిమల రూపంలో వస్తుంటాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 18, 2024 / 03:28 PM IST

    Pimples

    Follow us on

    Pimples: మొహం అందంగా ఉంటేనే ఎవరికి అయినా నచ్చుతుంది. కొంచెం మొటిమలు, మచ్చలు ఉంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒకసారి మొటిమలు వస్తే దాని తాలుకు మచ్చలు పోవడం కూడా కష్టమే. మొటిమలు ఉంటే కొందరు ఇతరుల మధ్య మాట్లాడటానికి కూడా ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. వీటి సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవరు ఏ క్రీమ్ గురించి చెబితే ఆ క్రీములను వాడుతుంటారు. కానీ మొటిమల సమస్య నుంచి దూరం అవడం అంత సులభమైన పని కాదు.

    అదనపు జిడ్డు వల్ల మృతకణాలు బ్యాక్టీరియా చర్మరంధ్రాలలో పేరుకొనిపోయి మొహం మీద మొటిమల రూపంలో వస్తుంటాయి. అయితే ఈ సమస్యకు కూడా విటిమిన్ లు కారణం అంటున్నారు నిపుణులు. విటమిన్ ల లోపం వల్ల మొటిమల సమస్య వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుందట. విటమిన్ ఏ లేకపోవడం వల్ల మొటిమలు వస్తాయి. ఇది ఒకరకమైన యాంటీ ఆక్సిడెంట్ ల ఉంటుంది. ఇది మన చర్మాన్ని కాపాడటానికి చాల ముఖ్యంగా పనిచేస్తుంది. ఈ లోపం మీలో ఉంటే పచ్చిమిర్చి, టమోటాలు, క్యారెట్ లను మీ డైట్ లో భాగం చేసుకోండి.

    విటమిన్ బీ3 లోపం వల్ల కూడా మొటిమల సమస్య ఉంటుంది. ఈ విటమిన్ యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని లోపం వల్ల మొటమలు వస్తాయి. అయితే ఈ విటమిన్ వల్లనే చర్మ కాంతి మరింత మెరుగ్గా ఉంటుంది. ఇక విటమిన్ డి రోగనిరోధక శక్తిని పెంచుతుంది అనే విషయం తెలిసిందే. దీనివల్ల కూడా మొటిమల సమస్యలు వస్తాయి. ఇక ఈ విటమిన్ లోపం ఉండకూడదు అంటే పాలు, గుడ్లు వంటివి తీసుకోవాలి.

    ఆరోగ్యకరమైన చర్మానికి విటమిన్ ఇ ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఇ కొల్లాజెన్ ను నిర్మించడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. దీని వల్ల చర్మ కాంతి కూడా మీ సొంతం అవుతుంది. మరి తెలుసుకున్నారు కదా ఏ విటమిన్ ల వల్ల మొటిమలు వస్తాయో.. ఓసారి ఈ విటమిన్ లోపం ఉందో చెక్ చేసుకొని వాటి కోసం తగిన ఆహారం తీసుకోండి.