Young Heroes: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది మాత్రమే మాట్లాడుతుంది. ఎవరు ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ లు దక్కిన వాళ్లకు మాత్రమే ఇక్కడ స్టార్ స్టేటస్ అనేది వరిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క హీరో టార్గెట్ కూడా సక్సెస్ కొట్టడమే…ఎన్ని సినిమాలు చేశామనే దానికన్నా ఎన్ని సినిమాలు సక్సెస్ కొట్టాము అనేది మాత్రమే మన మార్కెట్ ను నిర్ణయిస్తుంది. ఇక అప్పుడు మాత్రమే మంచి ప్రొడ్యూసర్లు గాని, డైరెక్టర్లు గాని మన దగ్గరికి వచ్చి మనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు.
ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది యంగ్ హీరోలు ఎన్ని సినిమాలు చేసినా కూడా వాళ్లకు మాత్రం సక్సెస్ లు దక్కడం లేదు. ఇక అందులో మొదటగా రామ్ పోతినేని గురించి చెప్పుకోవాలి. ఈయన తన ఎనర్జీతో మంచి సినిమాలను చేస్తూ ఆ సినిమాలని సక్సెస్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నాడు. కానీ సినిమాల్లో కంటెంట్ ప్రాబ్లం వలనో లేదంటే డైరెక్టర్ల ఫాల్ట్ వల్లనో ఆ సినిమాలు పెద్దగా ఆడటంలేదు. ఇక “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో పాన్ ఇండియాలో ఒక మంచి సక్సెస్ గా అందుకున్నా రామ్ ఆ తర్వాత వచ్చిన రెడ్, స్కంద లాంటి సినిమాలతో డిజాస్టర్లను మూట గట్టుకున్నాడు. ఇక ఇప్పుడు “డబల్ ఇస్మార్ట్” అనే సినిమాతో మళ్లీ మన ముందుకు వస్తున్నాడు. ఇక ఈ సినిమాతో కనక సక్సెస్ కొట్టకపోతే ఆయన మార్కెట్ భారీగా పడిపోతుంది…
ఇక ఎన్ని సినిమాలు చేసిన అసలు హిట్ అనేది లేకుండా ముందుకు కదులుతున్న మరొక హీరో గోపీచంద్..ఆయన అప్పుడెప్పుడో వచ్చిన లౌక్యం సినిమాతో ఒక మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయనకు సరైన సక్సెస్ అయితే లేదు. ఇక ఇప్పుడు శ్రీను వైట్ల డైరెక్షన్ లో విశ్వం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సక్సెస్ కొడితే గోపీచంద్ ఇండస్ట్రీలో కొనసాగుతాడు. లేదంటే మాత్రం ఆయనతో సినిమాలు చేయడానికి ఏ డైరెక్టర్లు ముందుకు వచ్చే అవకాశాలు అయితే లేవు. ఇక రీసెంట్ గా భారీ అంచనాలతో వచ్చిన భీమా సినిమా కూడా నిరాశ పరచడంతో ఆయనకి ఎలాంటి కథలు ఎంచుకోవాలో అర్థం కావడం లేదు…
ఇక వీళ్ల తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగచైతన్యను కూడా మనం ఈ లిస్టులోకి తీసుకోవచ్చు. ఎందుకంటే నాగచైతన్య వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కానీ ఏ సినిమా కూడా ఆశించిన విజయాన్ని అయితే అందించడం లేదు. కాబట్టి ఇప్పుడు చందు మొండేటి డైరెక్షన్ లో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద నాగచైతన్య విపరీతమైన అంచనాలైతే పెట్టుకున్నాడు. ఇక దానికోసమే డే అండ్ నైట్ కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాతో కనక సక్సెస్ వస్తేనే ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతాడు. లేదంటే మాత్రం ఆయన మార్కెట్ కూడా భారీగా పడిపోతుంది…