https://oktelugu.com/

Nani: నాని సినిమాలో సెకండ్ హీరోగా చేస్తే స్టార్ హీరో అయిపోవచ్చా..?

ఒక్కొక్క మెట్టుఎదుగుతూ ఇప్పుడు 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే నాని హీరో అయిన తర్వాత చాలా మంచి సినిమాలను చేస్తూ వచ్చాడు.

Written By:
  • Gopi
  • , Updated On : April 18, 2024 / 03:28 PM IST

    If the second hero in Nani movie become a star hero

    Follow us on

    Nani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ తమ నటనతో నాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు నాని.. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాని, ఆ తర్వాత అష్ట చమ్మ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు అప్పటినుంచి ఒక్కొక్క మెట్టుఎదుగుతూ ఇప్పుడు 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే నాని హీరో అయిన తర్వాత చాలా మంచి సినిమాలను చేస్తూ వచ్చాడు.

    ఇక ఈయన సినిమాల్లో హీరోగా నటించిన కొంతమంది నటులు ఆ తర్వాత హీరోలుగా మారి సక్సెస్ ఫుల్ హీరోలుగా కూడా కొనసాగుతున్నారు. ఇక అందులో మొదటగా “భీమిలి కబడ్డీ జట్టు” సినిమాలో నటించిన “సిద్దు జొన్నలగడ్డ” గురించి చెప్పాలి. ఇక ఈయన ఈ సినిమాలో నటించినట్టుగా చాలామందికి తెలియదు. కానీ ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో ఆయన నటించి మెప్పించాడు.

    ఇక ఆ తర్వాత ‘గుంటూరు టాకీస్’ లాంటి సినిమాలో చేసిన కూడా సిద్ధు కి అనుకున్నంత గుర్తింపు అయితే రాలేదు. ఇంకా ఎప్పుడైతే డీజే టిల్లు సినిమాను చేశాడో అప్పుడు స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే నాని హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో విజయ్ దేవరకొండ నాని ఫ్రెండ్ గా నటించాడు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర కొద్దిసేపే ఉన్నప్పటికీ ఆ పాత్ర మాత్రం చాలా హైలైట్ గా నిలిచింది.

    ఇక ఆ తర్వాత విజయ్ కూడా ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా మారి ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సూపర్ సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు నానితోపాటు ఆయన సినిమాలో సెకండ్ హీరోగా నటించే ప్రతి ఒక్కరు స్టార్ హీరోలుగా మారిపోతున్నారు అనే ఒక టాక్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది…