Health Tips: గర్భిణులు మీరు కూడా పొగ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త

మహిళల్లో పొగతాగే వారి సంఖ్య కూడా మరింత ఎక్కువ అవుతుంది. ఆడ, మగ అనే తేడా లేకుండా సిగరెట్‌లోని నికోటిన్ అందరిని ఇబ్బంది పెట్టేస్తోంది. ఇక ఈ ధూమపానం వల్ల స్త్రీలకు ఎన్నో శారీరక సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.

Written By: Swathi Chilukuri, Updated On : June 1, 2024 3:00 pm

Health Tips

Follow us on

Health Tips: పిల్ల వల్ల ఇబ్బంది, ఉద్యోగాల్లో ఒత్తిడి, జర్నీలో ఇర్రిటేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అందుకే వీటినుంచి బయటపడాలని కొన్నింటికి వ్యసనంగా మారుతారు ప్రజలు. యూత్ ఎక్కువగా సిగరేట్ కు వ్యసనం అవుతున్న సంగతి తెలిసిందే. మరి దీని వల్ల లేకపోగా అనారోగ్య పాలవుతున్నారు. పురుషులు మాత్రమే కాదు మహిళలు కూడా ఒత్తిడి నుంచి దూరం అవడానికి సిగిరేట్ కు అలవాటు పడుతున్నారు.

మహిళల్లో పొగతాగే వారి సంఖ్య కూడా మరింత ఎక్కువ అవుతుంది. ఆడ, మగ అనే తేడా లేకుండా సిగరెట్‌లోని నికోటిన్ అందరిని ఇబ్బంది పెట్టేస్తోంది. ఇక ఈ ధూమపానం వల్ల స్త్రీలకు ఎన్నో శారీరక సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అధిక ధూమపానం వివిధ అవయవాలలో క్యాన్సర్ వచ్చే సమస్యను కూడా పెంచుతుంది.

ఈ ధూమపానం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశం ఎక్కువనట. అతిగా ధూమపానం చేస్తే స్త్రీలకు గర్భం దాల్చే సామర్థ్యం చాలా వరకు తగ్గుతుంది అంటున్నారు నిపుణులు. కొందరు ఏకంగా రోజుకు 10 లేదా అంతకంటే ఎక్కువ సిగరెట్లు కూడా తాగుతుంటారు. వీరిలో సంతానలేమి ప్రమాదం మరింత ఎక్కువ. IVF ప్రక్రియ కూడా గర్భధారణ రేటును ప్రభావితం చేస్తుంది అంటున్నారు నిపుణులు.

గర్భధారణ సమయంలో స్త్రీలు పొగ అసలు తాగకూడదు. ఇలా చేస్తే పిండం ఊపిరితిత్తులు సరిగా అభివృద్ధి చెందవు. అనారోగ్యకరమైన బిడ్డ పుడుతారు. అధిక ధూమపానం మహిళల్లో ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్‌ను ప్రభావితం చేస్తుందట. అంతేకాదు పీరియడ్స్ సమస్య కూడా వస్తుంది. సక్రమంగా పీరియడ్స్ రావు.

ఇక ఎక్కువ ధూమపానం చేసే మహిళలకు గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సిగరెట్ పొగలోని కొన్ని రసాయనాలు గర్భాశయంలోకి ప్రవేశిస్తాయి. తద్వారా క్యాన్సర్‌ వస్తుందట. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా ధూమపానం చేయడం వల్ల మల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. తల్లి పాలను కూడా ప్రభావితం చేస్తుంది. సిగిరెట్ లోని నికోటిన్ రక్తంలోకి వెళుంది కాబట్టి తల్లి పాలలో కలుస్తుందట. అందుకే పొగతాగకూడదు. ఒకవేలా చేయాలి అనుకుంటే పాలు ఇచ్చిన తర్వాత 90 నిమిషాల వరకు పాలు ఇవ్వకూడదు.