Health Insurance: అనారోగ్య సమస్యలు విపరీతంగా ఎదురవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఆరోగ్య బీమా చేయించుకోవాలని కంపెనీలు చెబుతున్నాయి. ప్రజల్లో స్పృహ పెరిగేలా ప్రచారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్న నేపథ్యంలో.. ఆ ఆఫర్లకు తగ్గట్టుగా ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. ఇది ఒకరకంగా శుభ పరిణామం అయినప్పటికీ.. హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్న తర్వాత కంపెనీలు రకరకాల కండిషన్లు పెడుతున్నాయి. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్ చెల్లించినప్పటికీ ప్రజల జేబులకు చిల్లు పడుతోంది. ఆరోగ్య బీమా చేయిస్తున్నప్పుడు కంపెనీల ప్రతినిధులు ఈ విషయాలను ప్రజలకు చెప్పారు.. అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ.. అన్ని కవరేజ్ లు లభిస్తాయని చెబుతారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత.. అసలు షరతులు చెప్పి షాక్ కు గురిచేస్తారు. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తే.. హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.
అటువంటి ఆస్పత్రులను మాత్రమే ఎంచుకోవాలి
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు కచ్చితంగా నెట్వర్క్ ఉన్న ఆసుపత్రిలో మాత్రమే చేరాల్సి ఉంటుంది. నెట్వర్క్ పరిధిలో లేని హాస్పిటల్ లో గనుక చేరితే క్యాష్ లెస్ క్లెయిమ్ సాధ్యం కాదు. అలాంటప్పుడు పేషెంట్ ముందుగానే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత రీయిం బర్స్ మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది.
వ్యాధులు కచ్చితంగా ఆ జాబితాలో ఉండాలి
ఇన్సూరెన్స్ అందించే సంస్థ పాలసీ లిస్టులో మెన్షన్ చేసే వ్యాధులకు మాత్రమే కవరేజ్ లభిస్తుంది. ఆ లిస్టులో లేని వ్యాధి గనుక సోకితే.. ఆ వ్యాధి నివారణకు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరితే ఎట్టి పరిస్థితుల్లో ఆ బిల్లు క్లెయిమ్ కాదు. అందువల్ల పాలసీ తీసుకునే ముందు కచ్చితంగా డిసీజ్ లిస్టు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ముందే నిర్ధారించుకోవాలి
బీమా సంస్థలు కొన్ని వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ పెడుతుంటాయి. ఒకవేళ ఆ పీరియడ్ కనుక ముగియకపోతే.. వ్యాధితో ఆసుపత్రిలో చేరితే క్లెయిం అవడానికి అవకాశం ఉండదు. పైగా పేషంట్ చేసుకున్న రిక్వెస్ట్ ను బీమా సంస్థ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది.
సమాచారం ముందుగానే ఇవ్వాలి
కాస్ట్ లెస్ ట్రీట్మెంట్ కోసం నెట్వర్క్ హాస్పిటల్స్ లో చేరితే.. కచ్చితంగా ఇన్సూరెన్స్ సంస్థకు.. నెట్వర్క్ ఆసుపత్రి ముందస్తుగానే అభ్యర్థన పంపాల్సి ఉంటుంది. ఇది కూడా నిర్ణీత గడువులోనే పూర్తి కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ పని గనుక సకాలంలో పూర్తి చేయకపోతే క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సాధ్యం కాదు ..
నిర్ధారణ పత్రాలు
ఎంచుకున్న హాస్పిటల్.. పేషంట్ కు సంబంధించిన మెడికల్ రిపోర్టులు కచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీకి పంపాలి. రిపోర్టర్లలో ప్రతి దానిని కూడా ఇన్సూరెన్స్ కంపెనీ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రిపోర్టులలో ఏదైనా తేడా ఉంటే లేదా అసంపూర్ణంగా ఉంటే ట్రీట్మెంట్ కు ఇన్సూరెన్స్ కంపెనీలు ఒప్పుకోవు.
వివరాలు కచ్చితంగా ఉండాలి
క్లెయిమ్ ను పరిష్కరించడానికి ఇన్సూరెన్స్ కంపెనీకి పేషంట్ వివరాలు, బ్యాంక్ డీటెయిల్స్ కచ్చితంగా కావాలి. ఇన్సూరెన్స్ కంపెనీలో ఒకవేళ ఈ వివరాలను తప్పుగా నమోదు చేస్తే.. అసంపూర్ణంగా ఇస్తే.. ఇబ్బందులు ఎదురవుతాయి.