https://oktelugu.com/

మధుమేహాన్ని వేగంగా తగ్గించే ఆహార పదార్థాలు ఇవే..?

ఇతర దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలో మధుమేహ రోగుల సంఖ్య ఎక్కువనే సంగతి తెలిసిందే. సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల మూడు పదుల వయస్సులోపు ఉన్నవాళ్లు సైతం టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. మధుమేహ రోగులు ప్రతిరోజూ మందులు వాడటం, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా సులభంగా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు. షుగర్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోయినా మూర్చపోయే అవకాశాలు ఉంటాయి. అందువల్ల షుగర్ తో బాధ పడేవాళ్లు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 18, 2021 2:56 pm
    Follow us on

    ఇతర దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలో మధుమేహ రోగుల సంఖ్య ఎక్కువనే సంగతి తెలిసిందే. సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల మూడు పదుల వయస్సులోపు ఉన్నవాళ్లు సైతం టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. మధుమేహ రోగులు ప్రతిరోజూ మందులు వాడటం, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా సులభంగా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు.

    షుగర్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోయినా మూర్చపోయే అవకాశాలు ఉంటాయి. అందువల్ల షుగర్ తో బాధ పడేవాళ్లు షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉండే విధంగా తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ భయంకరమైన వ్యాధి వల్ల చిన్న దెబ్బ తగిలినా చర్మం తట్టుకోలేని స్థితి ఏర్పడుతుంది. కొందరు వంశపారంపర్యంగా షుగర్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. మధుమేహ రోగులు కొవ్వు కలిగిన సాల్మన్, హెర్రింగ్, ఆంకోవిస్ లాంటి కొవ్వు కలిగిన చేపలను ఎక్కువగా తీసుకోవాలి.

    కేలరీలు తక్కువగా ఉండే ఆకు కూరలు సైతం శరీరంలో షుగర్ లెవెల్స్ ను తగ్గించడంలో సహాయపడతాయి. వంటింటి పదార్థాలలో ఒకటైన దాల్చిన చెక్క రక్తంలోని షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. ప్రోటీన్లు పుష్కలంగా ఉండే గుడ్లు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా చేయడంలో తోడ్పడతాయి. ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉన్న పసుపు మధుమేహం వల్ల ప్రభావితమయ్యే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

    పెరుగు రక్తంలోని షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. మధుమేహులు రోజులో ఎక్కువసార్లు తక్కువమొత్తంలో పిండి పదార్థాలను తీసుకోవడం ద్వారా సులభంగా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోగలగుతారు. మధుమేహులు ఒకేసారి ఎక్కువ పరిమాణంలో భోజనం చేయకుండా తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు భోజనం చేస్తే మంచిది.