రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని అభిమానుల దశాబ్దాల కోరిక. అభిమానుల కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చేందుకు సూపర్ స్టార్ రజనీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అభిమానుల దశాబ్దాల కోరికను.. తన అనారోగ్య కారణాలతో పక్కన పెట్టేశాడు రజనీకాంత్. రాజకీయాల్లోకి వస్తున్నా.. వచ్చేస్తున్నా.. అని ఊరించీ, ఊరించీ చివరికి హ్యాండ్ ఇచ్చాడు.
Also Read: నేను రాను.. నన్ను ఇబ్బంది పెట్టకండి : మరోసారి క్లారిటీ ఇచ్చిన రజనీ
రజనీ రాజకీయాల్లోకి వస్తే, ఏమయ్యేదో తెలీదు గానీ, రాకపోవడం వల్ల మాత్రం.. తన ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు వాళ్లకు రజనీ మరో షాక్ ఇవ్వబోతున్నాడని చెన్నై వర్గాల టాక్. రజనీ త్వరలోనే సినిమాలకూ గుడ్ బై చెప్పబోతున్నాడని తమిళ సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అక్కడ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.
Also Read: రజనీకాంత్ మద్దతు ఆ పార్టీకేనా?
రజనీ చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ అయిపోయాక.. సినిమాలకు సైతం రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడని రజనీ సన్నిహితులు సైతం చూచాయిగా సమాచారం చేరవేస్తున్నారు. తన ఆరోగ్యం సరిగా లేదని, ఇప్పుడు తాను రాజకీయాలపై దృష్టిపెట్టలేనని రజనీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రజా సేవకు ఆరోగ్యం సహకరించకపోతే, మేకప్పులు వేసుకుని నటించడానికి.. ఓకేనా అంటూ తమిళనాట రజనీ వ్యతిరేకులు సెటైర్లు వేస్తున్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
అయితే.. ఇవన్నీ రజనీ దృష్టికి వెళ్లాయి. అలా కాకపోయినా.. రజనీ ఆరోగ్యం ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉంది. తరచూ ఆయన ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పైగా కరోనా భయాలు చాలా వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగులు చేసి, రిస్క్ తీసుకోవడం రజనీ కుటుంబ సభ్యులకు సైతం ఇష్టం లేదు. అందుకే సినిమాల్నీ తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. అయితే.. సినిమాలు మానేస్తున్నా అంటూ స్టేట్‌మెంట్లు ఏమీ ఇవ్వకుండా, సైలెంట్‌గానే, రిటైర్ అయిపోవాలని ఆయన భావిస్తున్నారట.