Ice Water Bath : ఐస్ బాత్‌‌తో ప్రయోజనాలు.. సెలబ్రిటీలు ఎక్కువగా ఈ బాత్ ఎందుకు చేస్తారు?

ప్రస్తుతం సెలబ్రిటీలు అనే కాకుండా సామాన్యులు కూడా ఐస్ బాత్ చేస్తున్నారు. ఐస్ బాత్ అంటే చల్లని నీటిలో స్నానం చేయడం. ఇలా ఐస్ బాత్‌లో స్నానం చేయడం వల్ల శరీరానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఐస్ బాత్‌ను ఇమ్మర్షన్ లేద క్రయోథెరపీ అని కూడా అంటారు. అయితే ఈ ఐస్ బాత్‌లో దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల పాటు ఉండాలి.

Written By: Bhaskar, Updated On : September 1, 2024 4:22 pm

Ice Water Bath

Follow us on

Ice Water Bath : సాధారణంగా సెలబ్రిటీలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు అందంగా ఉండాలని ఎన్నో పద్ధతులు పాటిస్తుంటారు. సెలబ్రిటీలు ఏదైనా కొత్త పద్ధతిని ఫాలో అయిన, డ్రస్ లేదా స్కిన్ కేర్ టిప్ ఇలా ఏది చెప్పిన అది ట్రెండ్ అయిపోతుంది. అందరూ కూడా వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలని ట్రై చేస్తారు. దీనికోసం మొదటిగా గూగుల్‌ను ఆశ్రయిస్తారు. ఇలా సెలబ్రిటీలు రోజువారి అలవాట్లలో ఫేమస్ అయినవి చాలానే ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా ఐస్ బాత్ చేస్తున్నారు. దీంతో అసలు ఈ ఐత్ బాత్ అంటే ఏంటని జనాలు తెగ గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఐస్ బాత్ చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో పాటు చర్మానికి కూడా ఐస్ బాత్ చాలా మేలు చేస్తుంది. ఇంతకీ ఈ ఐస్ బాత్ అంటే ఏంటి? దీనిని ఎలా చేస్తారు? ఎలా చేస్తే ప్రయోజనాలు ఉంటాయో మరి తెలుసుకుందాం.

ప్రస్తుతం సెలబ్రిటీలు అనే కాకుండా సామాన్యులు కూడా ఐస్ బాత్ చేస్తున్నారు. ఐస్ బాత్ అంటే చల్లని నీటిలో స్నానం చేయడం. ఇలా ఐస్ బాత్‌లో స్నానం చేయడం వల్ల శరీరానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఐస్ బాత్‌ను ఇమ్మర్షన్ లేద క్రయోథెరపీ అని కూడా అంటారు. అయితే ఈ ఐస్ బాత్‌లో దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల పాటు ఉండాలి. అప్పుడే ఐస్ బాత్ ప్రయోజనాలు ఉంటాయి. కొందరు కండరాల నొప్పులతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్లకి ఐస్ బాత్‌ చక్కగా ఉపయోగపడుతుంది. వ్యాయామం చేసిన తర్వాత ఐస్ బాత్ చేస్తే వాపులను కూడా తగ్గిస్తుంది. ఐస్ బాత్ వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. చాలామంది ఈరోజుల్లో మానసిక సమస్యలు, ఒత్తిడి, ఆందోళన వంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు. వీటిని తగ్గించుకోవడానికి ఐస్ బాత్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎలాంటి టెన్షన్ లేకుండా సంతోషంగా ఉంటారు.

ఐస్ బాత్ వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కొందరికి చర్మ సమస్యలు ఉంటాయి. ఐస్ బాత్ వల్ల అలెర్జీ వంటి చర్మ సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈరోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్లకి ఐస్ బాత్ చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే జీవక్రియను పెంచడంతో పాటు కొవ్వును తగ్గిస్తుంది. దీనివల్ల బరువు తగ్గుతారు. వీటితో పాటు గుండె సంబంధిత సమస్యల నుంచి కూడా బయటపడతారు. అయితే ఐస్ బాత్‌ను ఏదో బకెట్ వాటర్ కూర్చుంటే ఫలితం ఉండదు. బాడీ మొత్తం ఐస్‌లో స్నానం అయితేనే శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.