Saripodha Shanvaram Collections : మొదటి రోజు కంటే మూడవ రోజు ఎక్కువ వసూళ్లు..’సరిపోదా శనివారం’ కి రికార్డ్స్ సరిపొవట్లేదట!

ఈ సినిమాకి మొదటి రోజుకంటే మూడవ రోజు ఎక్కువ వసూళ్లు రావడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తం మీద మూడు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 53 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

Written By: Vicky, Updated On : September 1, 2024 4:36 pm

Saripodha Shanvaram Collections

Follow us on

Saripodha Shanvaram Collections :  నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని, అద్భుతమైన వసూళ్లతో ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికి తెలిసిందే. మొదటి రోజు వసూళ్లు నాని ‘దసరా’ రేంజ్ లో లేకపోయినా, రెండవ రోజు నుండి మాత్రం స్టడీ వసూళ్లతో అదరగొడుతుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలలో ఎక్కడ చూసినా విపరీతమైన వర్షాలు, వరదలు రావడం మనమంతా చూస్తూనే. ఈ ప్రభావం సినిమా మీద పడుతుందేమో అని అందరూ భయపడ్డారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా అనేక ప్రాంతాలలో ఈ సినిమాకి మొదటి రోజు తో సమానంగా వసూళ్లు వచ్చాయి. కొన్ని ప్రాంతాలలో అయితే మొదటి రోజుకంటే ఎక్కువ కూడా వచ్చాయి. ఉదాహరణకు నైజాం ప్రాంతం లో మొదటి రోజు ఈ చిత్రానికి రెండు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, మూడవ రోజు దాదాపుగా 2 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది సామాన్యమైన విషయం కాదు.

అలాగే గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలలో కూడా ఈ సినిమాకి మొదటి రోజుకంటే మూడవ రోజు ఎక్కువ వసూళ్లు రావడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తం మీద మూడు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 53 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. ముందుగా నైజాం విషయానికి వస్తే ఇక్కడ ఈ చిత్రం ఇప్పటి వరకు 6 కోట్ల 74 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. దసరా తర్వాత నాని సినిమాల్లో ఇంత గొప్ప వసూళ్లు రావడం ఈ సినిమాకే జరిగింది. అదే విధంగా సీడెడ్ లో కోటి 83 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఉత్తరాంధ్ర లో కోటి 64 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 64 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 61 లక్షలు, గుంటూరు జిల్లాలో 78 లక్షలు, కృష్ణ జిల్లాలో 84 లక్షలు, నెల్లూరు జిల్లాలో 52 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ గా మూడు రోజులకు గాను ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణకు కలిపి 13 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టగా, వరల్డ్ వైడ్ గా 25 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 42 కోట్ల రూపాయిల షేర్ మార్క్ ని దాటాలి. అది ఇప్పుడు చాలా తేలిక అని అంటున్నారు ట్రేడ్ పండితులు. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 5 కోట్ల 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, మూడవ రోజు 5 కోట్ల రూపాయిల షేర్ వచ్చిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.