షుగర్ తో బాధ పడుతున్నారా.. ఈ టీతో షుగర్ కు చెక్..?

చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది షుగర్ తో బాధ పడుతున్నారు. షుగర్ బారిన పడితే ఇతర అనారోగ్య సమస్యలు వేధించే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు జామ ఆకుల టీతో షుగర్ కు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. పేదవాడి యాపిల్ గా పిలవబడే జామ ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. జామ ఆకులతో టీ చేసుకొని తాగడం ద్వారా షుగర్ లెవెల్స్ తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. […]

Written By: Navya, Updated On : జనవరి 31, 2021 12:33 సా.
Follow us on

చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది షుగర్ తో బాధ పడుతున్నారు. షుగర్ బారిన పడితే ఇతర అనారోగ్య సమస్యలు వేధించే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు జామ ఆకుల టీతో షుగర్ కు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. పేదవాడి యాపిల్ గా పిలవబడే జామ ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. జామ ఆకులతో టీ చేసుకొని తాగడం ద్వారా షుగర్ లెవెల్స్ తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

జామ ఆకులను శుభ్రంగా కడిగి టీ చేసుకోవడం ద్వారా జామాకుల టీని తయారు చేసుకోవచ్చు. జామ ఆకులతో తయారు చేసిన టీ తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ పెరగడంతో పాటు షుగర్ లెవెల్స్ తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కనీసం 12 వారాలు జామాకుల టీని తీసుకోవడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు. జామ ఆకుల టీ వల్ల షుగర్ తో బాధ పడే వారిలో ఆల్ఫా గ్లూకోసైడేజ్ ఎంజైమ్ చైతన్యత తగ్గుతుందని తేలింది.

జామ ఆకుల టీ రక్తంలో సుక్రోజ్ మరియు మాల్టోజ్ గ్రహించడాన్ని తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. జపాన్ లోని “యాకుల్ట్ సెంట్రల్ ఇనిస్ట్యూట్” శాస్త్రవేత్తలు జామ ఆకులపై అనేక పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. విటమిన్ బి పుష్కలంగా లభించే జామ ఆకుల టీ వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. ఆస్తమా, అజీర్తి సమస్యలతో బాధ పడేవాళ్లు జామ ఆకుల టీని తాగితే ఆ సమస్యలు దూరమవుతాయి.

మహిళలు పీరియడ్స్ సమయంలో జామ ఆకుల టీ తాగితే పొట్ట నొప్పి తగ్గుతుంది. పంటి నొప్పి సమస్యలతో బాధ పడేవాళ్లు జామ ఆకులను శుభ్రంగా కడిగి నమిలితే మంచి ఫలితాలు ఉంటాయి. నోటిపూత, చివుర్ల నొప్పి లాంటి సమస్యలకు కూడా జామ ఆకులతో సులభంగా చెక్ పెట్టవచ్చు.