Benefits of Drinking Water: నీళ్లు తక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాలు మీకు తెలుసా?

Benefits of Drinking Water: ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లు ఖచ్చితంగా తాగాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. నీళ్లు తాగడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. ప్రతిరోజూ 8 గ్లాసుల నీళ్లు తాగితే గుండె వైఫల్యం వచ్చే ప్రమాదం తగ్గే అవకాశాలు ఉంటాయి. 15,792 మందిపై శాస్త్రవేత్తలు 25 సంవత్సరాల పాటు అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు. శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ బారిన […]

Written By: Kusuma Aggunna, Updated On : August 25, 2021 5:56 pm
Follow us on

Benefits of Drinking Water: ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లు ఖచ్చితంగా తాగాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. నీళ్లు తాగడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. ప్రతిరోజూ 8 గ్లాసుల నీళ్లు తాగితే గుండె వైఫల్యం వచ్చే ప్రమాదం తగ్గే అవకాశాలు ఉంటాయి. 15,792 మందిపై శాస్త్రవేత్తలు 25 సంవత్సరాల పాటు అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు.

శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ బారిన పడే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యుఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు సోడియం ద్వరా రక్తంలో నీటి కొరత ఉందో లేదో తెలుసుకోవచ్చని వెల్లడిస్తున్నారు. కనీసం 2 లీటర్ల నీళ్లు తాగాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు గుండె జబ్బులు కారణమనే సంగతి తెలిసిందే.

వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం ప్రతి ముగ్గురిలో ఒకరు గుండెజబ్బుల వల్ల మరణిస్తున్నారు. శరీరానికి సరిపడా నీళ్లు తాగని పక్షంలో రక్తం చిక్కబడుతుంది. తగిన నీళ్లు తాగకపోతే శరీరంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. శరీరం డీ హైడ్రేషన్ బారిన పడితే చర్మంపై మచ్చలు, ముడతలు రావడంతో పాటు అలర్జీలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.

శరీరానికి సరిపడా నీళ్లు తాగకపోతే మలబద్ధకం బారిన పడే అవకాశాలు ఉంటాయి. నీళ్లు తాగని వాళ్లలో ఎంజైమ్స్ యాక్టివ్ గా పని చేయవు. శరీరానికి సరిపడా నీళ్లు తాగని వాళ్లను జీర్ణ సంబంధిత సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. తక్కువగా యూరినేషన్ కు వెళుతున్నా శరీరానికి తగినన్ని నీళ్లు తాగడం లేదని భావించాలి.