Andhra Pradesh: ఏపీ తీరంలో కలకలం.. 2 కి.మీలు వెనక్కి వెళ్లిన సముద్రం

బ్రహ్మం గారు ఆధునిక యుగంలో చిత్రవిచిత్రాలు జరుగుతాయని.. చివరకు మనిషి చేసిన తప్పులే వారిని కడతేరుస్తాయని చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్ గురించి కూడా తన భవిష్యవాణిలో వినిపించారు. అదే ఇప్పుడు నిజమైంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మరో కలకలం చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది సముద్ర తీరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నిన్ననే బంగాళాఖాతంలోని సముద్రం అడుగున 10.కి.మీల లోతులో భూకంపం సంభవించిందని మనం విన్నాం. తాజాగా బంగాళాఖాతంలో గోదావరి నది కలిసే సంగమ ప్రదేశంలో […]

Written By: NARESH, Updated On : August 26, 2021 10:39 am
Follow us on

బ్రహ్మం గారు ఆధునిక యుగంలో చిత్రవిచిత్రాలు జరుగుతాయని.. చివరకు మనిషి చేసిన తప్పులే వారిని కడతేరుస్తాయని చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్ గురించి కూడా తన భవిష్యవాణిలో వినిపించారు. అదే ఇప్పుడు నిజమైంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మరో కలకలం చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది సముద్ర తీరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

నిన్ననే బంగాళాఖాతంలోని సముద్రం అడుగున 10.కి.మీల లోతులో భూకంపం సంభవించిందని మనం విన్నాం. తాజాగా బంగాళాఖాతంలో గోదావరి నది కలిసే సంగమ ప్రదేశంలో వింత చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది సముద్రం తీరంలో కొద్దిరోజులుగా సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. అలలు ఎగిసిపడి దర్శనానికి వచ్చిన భక్తులను భయపెట్టింది. తాజాగా అందుకు రివర్స్ గా మారింది.

తాజాగా అంతర్వేది సముద్ర తీరంలో ఉన్నట్టుండి సముద్రం నీరు రెండు కిలోమీటర్లు వెనక్కి పోవడం సంచలనమైంది. బహుశా భూకంపాలో, సునామీ వస్తుందని అక్కడి జనం భయంతో చస్తున్నారు. తూర్పు తీరంలో ఇలా సముద్రం వెనక్కి వెళ్లిపోవడం ఏదో పెద్ద విపత్తుకు సంకేతంగా చెబుతున్నారు.

సముద్రం ఇలా కొద్దిచోట్ల ముందుకు, వెనక్కి పోవడం సహజమేనని.. అయితే ఏకంగా రెండు కిలోమీటర్ల మేర వెనక్కి పోవడం మాత్రం ఏదో జరగబోతోందనడానికి సంకేతం అని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడ వారం క్రితం వరకూ సముద్రం 25 మీటర్ల మేర ముందుకొచ్చింది. మొత్తంగా 45 మీటర్ల మేర ముందుకు జరిగింది. సముద్రం ఒడ్డున ఉన్న భవనాలు ధ్వంసమయ్యాయి. ఇప్పుడు ఏకంగా 2 కి.మీలు సముద్రం వెనక్కి పోయింది. 20 ఏళ్లకోసారి ఇలా జరగుతుందని చెబుతున్నారు. సముద్ర తీరప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలను స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.