Flipkart’s Interest Free Loan: కస్టమర్లకు ఫ్లిప్ కార్ట్ తీపికబురు.. రూ.2 లక్షల రుణం పొందే ఛాన్స్!

Flipkart’s Interest Free Loan: ప్రముఖ ఈకామర్స్ సంస్థలలో ఒకటైన ఫ్లిప్ కార్ట్ కు చెందిన డిజిటల్ బీ2బీ మార్కెట్‌ప్లేస్ ఫ్లిప్‌కార్ట్ హోల్ సేల్ కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. కస్టమర్లకు ప్రయోజనం చేకూరే విధంగా కొత్త లోన్ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త లోన్ స్కీమ్ సహాయంతో సులభంగానే రుణం పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఫ్లిప్ కార్ట్ ద్వారా అందరూ రుణాలు పొందడం సాధ్యం కాదు. కేవలం కిరాణా షాపులకు […]

Written By: Navya, Updated On : August 25, 2021 6:15 pm
Follow us on

Flipkart’s Interest Free Loan: ప్రముఖ ఈకామర్స్ సంస్థలలో ఒకటైన ఫ్లిప్ కార్ట్ కు చెందిన డిజిటల్ బీ2బీ మార్కెట్‌ప్లేస్ ఫ్లిప్‌కార్ట్ హోల్ సేల్ కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. కస్టమర్లకు ప్రయోజనం చేకూరే విధంగా కొత్త లోన్ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త లోన్ స్కీమ్ సహాయంతో సులభంగానే రుణం పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఫ్లిప్ కార్ట్ ద్వారా అందరూ రుణాలు పొందడం సాధ్యం కాదు. కేవలం కిరాణా షాపులకు మాత్రమే ఫ్లిప్ కార్ట్ ద్వారా రుణాలు లభించనున్నాయి.

కేవలం కిరాణా షాపులు మాత్రమే ఈ విధంగా రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ లోన్ స్కీమ్ ద్వారా బిజినెస్ ను మరింత డెవలప్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కిరాణా స్టోర్ల ఆర్థిక ఇబ్బందులు తీర్చడమే లక్ష్యంగా ఫ్లిప్ కార్ట్ ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. కిరాణా షాపులు ఫ్లిప్ కార్ట్ ద్వారా జీరో కాస్ట్ లోన్స్ ను తీసుకునే అవకాశం ఉంటుంది. ఎటువంటి వడ్డీ లేకుండానే రుణాన్ని పొందే ఛాన్స్ ఉంటుంది.

కేవలం 5,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయల వరకు సులభంగా రుణాన్ని తీసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్స్ కూడా ఉండటంతో కిరాణా షాపు యజమానులకు భారీగా ప్రయోజనం చేకూరుతుంది. ఫ్లిప్ కార్ట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కిరాణా షాపుల యజమానులు ప్రశంసిస్తున్నారు. కొత్త లోన్ స్కీమ్ ద్వారా కిరాణా షాపు యజమానులకు ఆర్థిక భారం తగ్గుతుంది.

వ్యాపారం మరింత వృద్ధి చేసుకోవాలని భావించే వాళ్లు ఈ లోన్ యొక్క బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఫ్లిప్ కార్ట్ హోల్ సేల్ వెబ్ సైట్ ద్వారా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.