కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ వల్ల వర్క్ ఫ్రం హోం ద్వారా ఉద్యోగాలు చేసేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఎక్కువ సమయం కూర్చుని పని చేయడం వల్ల చాలామందిని నడుమునొప్పి సమస్య వేధిస్తోంది. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సులభంగా నడుమునొప్పి సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. చాలామందిని నడుమునొప్పి తగ్గించుకోవడం కోసం మందులపై ఆధారపడుతూ ఉంటారు.
Also Read: బంగాళదుంపలతో చేసిన వంటలు తింటే ఆ సమస్యలు వస్తాయా..?
అయితే మందుల కంటే సహజసిద్ధమైన చిట్కాలు పాటించడం ద్వారా నడుమునొప్పికి చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. ఐస్ ముక్క సహాయంతో నొప్పి ఉన్నచోట కాపడం ద్వారా సమస్యకు చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజూ పాలలో తేనె కలుపుకుని తాగినా నడుము నొప్పి సమస్య తగ్గుతుంది. పాలలో రెండు స్పూన్ల గసగసాల పొడి వేసుకుని తాగినా నడుమునొప్పికి చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. అల్లం పేస్ట్ ను నడుము నొప్పి ఉన్నచోట పెట్టినా మంచి ఫలితం ఉంటుంది.
Also Read: జొన్న రొట్టె తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
అల్లం ముక్కలను మరిగించి తేనె కలుపుకుని తాగినా నడుమునొప్పి సమస్య తగ్గుతుంది. ఎక్కువ మంది కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ముందు ఎక్కువ సమయం పని చేయడం వల్ల నడుమునొప్పితో బాధ పడుతున్నారు. మానిటర్ ను కళ్లకు సమానంగా ఉండేలా చూసుకోవడంతో పాటు మానిటర్ కు, కళ్లకు కనీసం 20 అంగుళాల దూరం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నడుమునొప్పితో బాధ పడేవాళ్లు కెఫిన్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం తగ్గించాలి.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
అసలు వ్యాయామం చేయకపోయినా కొన్ని సందర్భాల్లో నడుము నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రతిరోజూ యోగా ఆసనాలను చేయడం ద్వారా నడుము నొప్పి సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. బరువులు ఎత్తే సమయంలో మోకాళ్లను కిందికి వంచడం ద్వారా నడుపు నొప్పికి సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.