దేశంలో అసిడిటీ సమస్యతో బాధ పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వేర్వేరు కారణాల వల్ల చాలామంది అసిడిటీ బారిన పడుతున్నారు. ఒకసారి అసిడిటీ బారిన పడ్డారంటే వారిని ఇతర సమస్యలు కూడా వేధించే అవకాశం ఉంటుంది. అయితే మందులు అవసరం లేకుండా అసిడిటీ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. గోరువెచ్చని నోరు అసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది.
Also Read: నడుమునొప్పిని సులువుగా తగ్గించే చిట్కాలు ఇవే..?
అసిడిటీ సమస్యతో బాధ పడేవారికి ఆహారం తిన్న తరువాత చాలా సమయం పాటు పుల్లటి త్రేన్పులు వస్తాయి. గొంతులో అసౌకర్యంగా ఉండటంతో పాటు ఆమ్లాల స్థాయి పెరుగుతుంది. గోరువెచ్చని నీటిలో రెండు లేదా మూడు యాలకులు వేసి తీసుకుంటే సమస్య త్వరగా తగ్గుతుంది. గోరువెచ్చని నీటికి తేనె కలిపినా మంచి ఫలితం ఉంటుంది. అసిడిటీ సమస్యకు చెక్ పెట్టడంలొ జీలకర్ర కూడా సహాయపడుతుంది.
Also Read: జొన్న రొట్టె తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
లవంగాలు తరచూ తీసుకోవడం ద్వారా కూడా అసిడిటీ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అసిడిటీ సమస్యతో బాధ పడేవారు మొదట నీటిని, పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా కూడా అసిడిటీ సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. నీటిలో జీలకర్ర వేసి మరగించి ఆ నీటిని తాగినా కూడా అసిడిటీ సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
రోజూ భోజనం చేసిన తర్వాత తాజా అల్లాన్ని తినడం ద్వారా అసిడిటి సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. భోజనం తరువాత గ్లాసు నీటిలో నల్ల ఉప్పు మరియు వాము పొడి కలిపి తాగడం వల్ల అసిడిటీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.