https://oktelugu.com/

కేసీఆర్ సర్కారుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన రాములమ్మ..!

తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఫలితాలే వీటిని స్పష్టం చేశాయి. ఈ రెండు ఎన్నికల్లోనూ అధికార పార్టీకి బీజేపీ గట్టి సవాల్ విసిరింది. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అనే టాక్ విన్పిస్తోంది. ఈ రెండు ఎన్నికల తర్వాత బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. ఈక్రమంలోనే ఇతర పార్టీల నేతల బీజేపీలోకి క్యూ కడుతున్నారు. ఇటీవలే సినీ నటి విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 13, 2020 8:59 pm
    Follow us on

    Vijayashanti

    తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఫలితాలే వీటిని స్పష్టం చేశాయి. ఈ రెండు ఎన్నికల్లోనూ అధికార పార్టీకి బీజేపీ గట్టి సవాల్ విసిరింది. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అనే టాక్ విన్పిస్తోంది.

    ఈ రెండు ఎన్నికల తర్వాత బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. ఈక్రమంలోనే ఇతర పార్టీల నేతల బీజేపీలోకి క్యూ కడుతున్నారు. ఇటీవలే సినీ నటి విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తన మాతృ పార్టీ బీజేపీలోకి చేరారు.

    బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే. ఆమె బీజేపీ చేరినప్పటి నుంచి  సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా మరోసారి కేసీఆర్ సర్కారుపై విజయశాంతి సంచలన కామెంట్స్ చేశారు.

    సీఎం కేసీఆర్ ను ఢిల్లీలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. ప్రోటోకాల్‌తో అపాయింట్‌మెంట్ తీసుకొని తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేసే కుట్ర చేస్తున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

    కేసీఆర్ గత ఆరేళ్లుగా ఎన్నో అవినీతి ఆరోపణకు పాల్పడ్డారని త్వరలోనే నిరూపితం అవుతాయన్నారు. ప్రజలను మభ్యపెడుతూ కాలం గడుపుతున్న కేసీఆర్‌ సర్కార్ త్వరలోనే కూలడం ఖాయమని ఆమె హెచ్చరించారు.