సీఎం జగన్ మరోసారి ఏపీ ప్రజలపై వరాలు కురిపించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు ఉదయం 11 గంటలకు జరుగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
Also Read: ఏపీ ప్రజలపై వరాలకు జగన్ రెడీ!
ముఖ్యంగా ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్న జనవరి 9వ తేదిన ‘అమ్మఒడి’ పథకానికి క్యాబినేట్ ఆమోదం తెలుపనుంది. అలాగే రైతు భరోసా పథకం రెండో విడతకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇక రాష్ట్రంలో మెడికల్ ఎడ్యూకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది.
ఇక రాష్ట్రంలో వెటర్నరీ ల్యాబ్ లు ఏర్పాటు చేసే అంశంపై మంత్రివర్గ సమావేశం చర్చించనున్నారు. దాంతోపాటు గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యామ్మాయంపై చర్చించనున్నారు.
Also Read: చంద్రబాబు సంచలనం: మూడు రాజధానులకు ప్రజలు ఓటేస్తే రాజకీయ సన్యాసం
సీఎం జగన్ ఈ కేబినెట్ భేటిలో ఏం నిర్ణయాలు తీసుకుంటాడు? ఎలాంటి వరాలు కురిపిస్తాడనేదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ రోజు కేబినెట్ భేటి కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్