మనలో చాలామంది బెల్లంతో పోలిస్తే చక్కెర వినియోగానికి ప్రాధాన్యతనిస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కాఫీ, టీలతో పాటు చక్కెరతో తయారు చేసిన స్వీట్లు తినడానికే ఆసక్తి చూపుతారు. అయితే అతిగా చక్కెరను వినియోగించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది. చక్కెరను ఎక్కువగా వాడేవారు బరువు పెరగడంతో పాటు వారి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది.
Also Read: ఈ అలవాట్లు మీకు ఉంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గినట్లే..?
తాజాగా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో చక్కెరను ఎక్కువగా వినియోగించే వాళ్లకు శరీరంలో క్యాన్సర్ టూమర్లు పెరిగే అవకాశం ఉందని తేలింది. బెల్జియం శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఎక్కువ మోతాదులో చక్కెర తీసుకునే వారు నీరసం, బద్ధకం, ఏకాగ్రత కోల్పోవడం లాంటి సమస్యలతో బాధ పడే అవకాశం ఉంటుంది. చక్కెరను ఎక్కువగా తినేవాళ్ల అందం పాడవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: నడుమునొప్పిని సులువుగా తగ్గించే చిట్కాలు ఇవే..?
తీపి పదార్థాల ద్వారా శరీరంలోకి వెళ్లిన చక్కెర పులిసిపోతుందని.. శరీరంలోని క్యాన్సర్ కణాలు పులిసిపోయిన చక్కెర సహాయంతో శక్తిని పొందుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చక్కెర స్కిన్ ఎలాస్టిసిటీని తగ్గించడంతో పాటు చిన్న వయస్సులోనే పెద్దవాళ్లలా కనిపించడానికి కారణమవుతుంది. చక్కెరతో పాటు చక్కెరతో పాటు ఐస్ క్రీం, జామ్, చాక్లెట్స్ కు దూరంగా ఉంటే మంచిది.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లంను ఎక్కువగా వినియోగిస్తే మంచిది. చక్కెరను ఎక్కువగా వినియోగించే వాళ్లలో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. తరచూ జబ్బుల బారిన పడుతున్నామంటే చక్కెర వాడకాన్ని వీలైనంత తగ్గిస్తే మంచిది.