రైతుల ఆందోళన: యాంటీ మోడీ.. జియోకు భారీ దెబ్బ?

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా మారింది దేశంలోని ఓ టాప్ టెలికాం కంపెనీ పరిస్థితి. ప్రధాని మోడీ, బీజేపీపై వ్యతిరేకతతో ఉన్న ఉత్తరాధి రైతులను ఇదే అదునుగా టెలికాం కంపెనీలు ఆకర్షిస్తున్నాయట.. ఇప్పుడు దేశంలో మోడీకి సన్నిహితుడైన గుజరాతీ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ సారథ్యంలోని జియో టెలికాంను వ్యతిరేకించాలని సోషల్ మీడియాలో ప్రత్యర్థి టెలికాం కంపెనీలు హోరెత్తిస్తున్నాయట.. పెద్ద ఎత్తున ఉత్తరాదిలో జియో నుంచి ఎయిర్ టెల్, వోడాఫోన్-ఐడియాకు కస్టమర్లు మారుతున్న వైనం చర్చనీయాంశంగా […]

Written By: NARESH, Updated On : December 15, 2020 10:20 am
Follow us on

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా మారింది దేశంలోని ఓ టాప్ టెలికాం కంపెనీ పరిస్థితి. ప్రధాని మోడీ, బీజేపీపై వ్యతిరేకతతో ఉన్న ఉత్తరాధి రైతులను ఇదే అదునుగా టెలికాం కంపెనీలు ఆకర్షిస్తున్నాయట.. ఇప్పుడు దేశంలో మోడీకి సన్నిహితుడైన గుజరాతీ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ సారథ్యంలోని జియో టెలికాంను వ్యతిరేకించాలని సోషల్ మీడియాలో ప్రత్యర్థి టెలికాం కంపెనీలు హోరెత్తిస్తున్నాయట.. పెద్ద ఎత్తున ఉత్తరాదిలో జియో నుంచి ఎయిర్ టెల్, వోడాఫోన్-ఐడియాకు కస్టమర్లు మారుతున్న వైనం చర్చనీయాంశంగా మారుతోంది.

Also Read: కేసీఆర్, జగన్ ఢిల్లీ టూర్స్: ఏపీ, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్జిస్ ల బదిలీలు?

ఉత్తర భారత్ లో ప్రస్తుతం కొనసాగుతున్న రైతుల ఉద్యమంలో వోడాఫోన్-ఐడియా, ఎయిర్ టెల్ రెండు సంస్థలు అనైతికంగా ఎంఎన్పీకి పాల్పడుతున్నాయని జియో తాజాగా సంచలన ఆరోపణ చేసింది.. జియో నుంచి తమ నెట్ వర్క్ లకు మారడం అంటే రైతులకు మద్దతు పలకడమేనంటూ అర్థరహిత వ్యాఖ్యలు ఇవి చేస్తున్నాయని జియో ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా లేఖకు జతచేసింది.ఇది పెద్ద దుమారం రేపింది.

దేశ టెలికాం రంగంలో డిజిటల్ విప్లవాన్ని సృష్టించిన జియో ధాటికి ప్రత్యర్థి టెలికాం కంపెనీలు కుదేలయ్యాయి. వోడాఫోన్, ఐడియాలు అయితే విలీనం అయిన పరిస్థితి తలెత్తింది. ఇక ఎయిర్ టెల్ కాస్త గట్టిగానే నిలబడ్డా.. జియో ఆఫర్ల ముందు తడబడుతోంది. ఈ క్రమంలోనే రైతుల ఆందోళనను ప్రత్యర్థి టెలికాం కంపెనీలు క్యాష్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది.

Also Read: ఏపీ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. ఫీజులు రద్దు చేసిన జగన్ సర్కార్..?

అయితే జియో ఆరోపణలను ఎయిర్ టెల్ ఖండించింది. పారదర్శక వ్యాపారం చేస్తున్నామని తెలిపింది. పోటీదారులను, భాగస్వాములను గౌరవిస్తామని.. నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్