దేశంలో బీమా పాలసీలను తీసుకునే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా బీమా పాలసీ ఉంటే సులభంగా ఇబ్బందులు పడకుండా ఉండవచ్చు. అయితే బీమా పాలసీ ఎంపిక సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సంస్థలు, పాలసీ పత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పాలసీలు ఉన్నా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో పాలసీని క్లెయిం చేసుకోవాలన్నా క్లెయిం చేసుకోవడం సాధ్యం కాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు.
Also Read: రెండు మూడు క్రెడిట్ కార్డులు వాడుతున్నారా.. చేయకూడని తప్పులివే..?
అందువల్ల బీమా పాలసీలను ఎంపిక చేసుకునే సమయంలో నిబంధనలపై పూర్తిస్థాయిలో అవగాహనను కలిగి ఉంటే మంచిది. జీవిత బీమా తీసుకున్నా, ఆరోగ్య బీమా ఎలాంటి షరతులు ఉన్నాయో, ఆ షరతుల వల్ల పడే ఇబ్బందుల గురించి తెలుసుకోవాలి. చాలామంది తప్పుడు సమాచారం ఇచ్చి తక్కువ ప్రీమియం చెల్లించి పాలసీలను తీసుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల పాలసీ రద్దయ్యే అవకాశాలు ఉంటాయి.
Also Read: 8 వేల రూపాయలు తగ్గిన బంగారం ధర… ఇప్పుడు కొనవచ్చా..?
జీవిత బీమా పాలసీ సమయంలో చాలామంది ఆదాయ వివరాలను తప్పుగా చెబుతూ ఉంటారు. అయితే సరైన ఆదాయ వివరాలను చెప్పడం వల్ల మనకు ఎలాంటి పాలసీ ఉపయోగపడుతుందో అలాంటి పాలసీలనే పొందవచ్చు. పాలసీలు తీసుకునే సమయంలో ఆరోగ్య అలవాట్లకు సంబంధించిన వివరాలను కూడా ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్ నుంచే ప్రీమియం చెల్లించే విధంగా ఏర్పాట్లు చేసుకుంటే ఇబ్బందులు పడకుండా ఉండవచ్చు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే ఏవైనా వ్యాధులు ఉంటే ఆ వివరాలను ముందుగానే తెలియజేయాలి. బీమా పాలసీని క్లెయిం చేసుకోవడానికి చాలామంది ఆలస్యం చేస్తుంటారు. ఆలస్యంగా దరఖాస్తు చేసుకుంటే క్లెయిం చేసుకునే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.