https://oktelugu.com/

వివేకా హత్య కేసు.. జగన్‌ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా..?

ఎన్నో సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. సంక్షేమ పథకాల అమలులో నంబర్‌‌ వన్‌ పొజిషన్‌లో ఉన్న ఆయన.. తన బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి కేసును మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివేకా హత్య కేసులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దీనికి జగన్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. Also Read: ఆంధ్రాలో బ్యాంకులపై ప్రభుత్వ ఉగ్రవాదం వైఎస్ వివేకానందరెడ్డి గత ఏడాది […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 26, 2020 10:03 am
    Follow us on

    Viveka murder case
    ఎన్నో సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. సంక్షేమ పథకాల అమలులో నంబర్‌‌ వన్‌ పొజిషన్‌లో ఉన్న ఆయన.. తన బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి కేసును మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివేకా హత్య కేసులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దీనికి జగన్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    Also Read: ఆంధ్రాలో బ్యాంకులపై ప్రభుత్వ ఉగ్రవాదం

    వైఎస్ వివేకానందరెడ్డి గత ఏడాది మార్చిలో హత్యకు గురయ్యారు. ఆయన శరీరంపై ఏడు కత్తిపోట్లు ఉండటంతో దారుణ హత్య అని చెప్పకనే తెలుస్తోంది. ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగడంతో అప్పట్లో జగన్ దీనిని అస్త్రంగా మార్చుకున్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై నమ్మకం లేదని జగన్ పదే పదే ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఈ హత్యలో టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు బలమైన ఆరోపణలు చేశారు.

    అయితే.. వివేకానందరెడ్డి హత్య జరిగిన నాలుగు నెలలకే జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా మరో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేశారు. కేసును మాత్రం సీబీఐకి అప్పగించలేదు. దీంతో వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో తప్పనిపరిస్థితిలో జగన్‌ ఈ హత్య కేసును సీబీఐకి అప్పగించారు. అయితే.. సీబీఐకి ఇచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ ఏమీ తేల్చలేదు. తమకు హత్యకేసుకు సంబంధించి పూర్తిస్థాయి రికార్డులు ఇవ్వాలని సీబీఐ హైకోర్టును ఆశ్రయించడం కూడా చర్చనీయాంశమైంది.

    Also Read: కలకలం: క్రిస్మస్ వేళ అమెరికాలో భారీ పేలుడు

    ఇక ఇప్పుడు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొందరు కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ఈ హత్య కేసు నుంచి వారిని తప్పించేందుకే జగన్ తరచూ కేంద్రమంత్రి అమిత్ షాను కలుస్తున్నారని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. వివేకా హత్య కేసులో ఎవరు నిందితులన్నది పక్కన పెడితే.. దీనికి జగన్ జవాబుదారీగా నిలవాల్సిన పరిస్థితి మాత్రం వచ్చింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దగ్గరపడుతున్నా సొంత బాబాయి హత్య కేసునే ఛేదించలేకపోయారన్న విమర్శలను జగన్ ఎదుర్కొంటున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్