ఉద్యోగులు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న పీఆర్సీని ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పీఆర్సీకి సంబంధించిన నివేదిక ఇప్పటికే సీఎం చేతికి చేరింది. దీనిపై కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: వివేకా హత్య కేసు.. జగన్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా..?
తుది నివేదికపై సీఎం కేసీఆర్ ఈనెల 30న ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ భేటి అయి చర్చించబోతున్నారు.. అదేరోజు పీఆర్సీపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రపంచమంతా ఆర్థికమద్యం నెలకొన్న నేపథ్యంలో ఉద్యోగుల డిమాండ్లన్నీ పరిష్కారం కాకపోవచ్చని తెలుస్తోంది. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా ఉండేలా సీఎం కేసీఆర్ ఇప్పటికే కసరత్తులు చేసినట్లు సమాచారం.
ఉద్యోగులతో చర్చల తర్వాత కేసీఆరే స్వయంగా పీఆర్సీపై ప్రకటన చేసే అవకాశం ఉంది. సెంట్రల్ పే రివిజన్ కమిషన్ తరహాలోనే ఇకపైన పదేళ్లకోసారి పీఆర్సీ ఇచ్చేలా కొత్త నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
కేంద్రం ప్రకటించే డీఏ తరహాలోనే రాష్ట్రంలోనూ అమలు చేయాలని.. 3శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని.. జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు 20శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని నిర్ణయం తీసుకునున్నారని టాక్ విన్పిస్తోంది.
Also Read: ఆంధ్రాలో బ్యాంకులపై ప్రభుత్వ ఉగ్రవాదం
ఇప్పటివరకు పూర్తిస్థాయి పింఛన్ పొందడానికి 33ఏళ్ల సర్వీసు ఉండగా దానిని 31ఏళ్లకు కుదించనున్నట్లు తెలిసింది. ఉద్యోగ సంఘాలు 63శాతం ఫిట్ మెంట్ డిమాండ్ చేయగా ప్రభుత్వం 33శాతం ఫిట్ మెంట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
పీఆర్సీ ప్రకటనకు ముందే ఉద్యోగ సంఘాల నాయకులతో కేసీఆర్ ప్రగతి భవన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ఉద్యోగులకు వివరించి వారిలో వ్యతిరేకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ఉద్యోగ సంఘాల నాయకులు అప్పగించారనే టాక్ విన్పిస్తోంది.
నూతన సంవత్సరానికి ముందే సీఎం కేసీఆర్ పీఆర్సీ.. ఇతర డిమాండ్లపై ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపుతుందా? లేదా అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్