Skin Care Tips: ర్యాషెస్, దురదతో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయండి

తులసి ఆకులు.. వీటిల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. తులసి ఆకుల్లో ఉన్న యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో తులసి ఆకులను నీటిలో వేసి కాసేపు ఉంచిన తరువాత స్నానం చేయడం వలన చర్మ సమస్యలు దూరం అవుతాయి.

Written By: Swathi, Updated On : May 14, 2024 3:30 pm

Skin Care Tips

Follow us on

Skin Care Tips: వేసవి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ పలు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా అనేక చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. రెడ్ ర్యాషెస్, దురద, చెమటకాయలు, కురుపులు మరియు చర్మం కమిలిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చిన్నారుల నుంచి పెద్దవారిని కూడా ఈ సమస్యలు వేధిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే వీటి నుంచి సహాజంగా ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం.

తులసి ఆకులు.. వీటిల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. తులసి ఆకుల్లో ఉన్న యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో తులసి ఆకులను నీటిలో వేసి కాసేపు ఉంచిన తరువాత స్నానం చేయడం వలన చర్మ సమస్యలు దూరం అవుతాయి.

కలబంద.. ఎండాకాలంలో కలిగే చర్మ సమస్యలను తగ్గించడంలో కలబంద ఎంతో బాగా పని చేస్తుంది. ఇందులో ఇన్ ఫెక్షన్లను దూరం చేసే గుణాలు ఉన్నాయి. దీంతో దురద, ర్యాషెస్ తో పాటు చెమటకాయలను తగ్గించుకోవచ్చు. అలాగే… యాపిల్ సైడర్ వెనిగర్… వేసవిలో వచ్చే అనేక రకాల చర్మ సంబంధిత సమస్యలకు దీనితో చెక్ పెట్టొచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ లో యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

అదేవిధంగా కొబ్బరి నూనె.. సమ్మర్ లో వచ్చే చర్మ సమస్యలను తగ్గించుకునేందుకు కొబ్బరి నూనె కూడా బాగా పని చేస్తుంది. స్నానం చేయడానికి ఓ గంట ముందు శరీరానికి బాగా ఆయిల్ పట్టించాలి. ఈ విధంగా ఆయిల్ పట్టించిన తరువాత స్నానం చేయడం వలన శరీరం చల్లబడుతుంది.

చెమట ఎక్కువగా పట్టడం వలన కొందరికీ చర్మంపై దద్దుర్లు, దురదలు వస్తుంటాయి. అలాంటి సమయంలో కాస్త పటికను తీసుకుని మెత్తగా చేసి నీటిలో రాసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.