https://oktelugu.com/

Dinner: రాత్రి అన్నం తినడం మానేస్తున్నారా? అయితే జాగ్రత్త

సాధారణంగా ఉదయం మధ్యాహ్నం కంటే రాత్రిళ్లు తక్కువ ఆహారం తీసుకోవాలి అని చెబుతుంటారు నిపుణులు. రాత్రి శరీరానికి శ్రమ ఉండదని ఈ సలహా ఇస్తారు. బిజీ లైఫ్ లో రాత్రి పది తర్వాత భోజనం చేసే వారి సంఖ్య మరింత పెరుగుతుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 3, 2024 / 12:42 PM IST

    Dinner

    Follow us on

    Dinner: ప్రస్తుత రోజుల్లో అధిక బరువు పెద్ద సమస్యగా మారుతుంది. బరువు ఎలా తగ్గాలి అని చేయని పనులు ఉండవు కొందరు. ఇందులో భాగంగానే కొందరు రాత్రి పూట భోజనం చేయడం మానేస్తారు.రాత్రి పూట అధికంగా ఆహారం తీసుకుంటే బరువు పెరుగుతారు అని చెబుతుంటారు నిపుణులు. దీంతో కొందరు మొత్తానికే ఆహారాన్ని తీసుకోకుండా ఉంటున్నారు. కానీ దీని వల్ల చాలా సమస్యలు వస్తాయట. ఇంతకీ రాత్రి భోజనం చేయకపోవడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఓ సారి తెలుసుకోండి.

    సాధారణంగా ఉదయం మధ్యాహ్నం కంటే రాత్రిళ్లు తక్కువ ఆహారం తీసుకోవాలి అని చెబుతుంటారు నిపుణులు. రాత్రి శరీరానికి శ్రమ ఉండదని ఈ సలహా ఇస్తారు. బిజీ లైఫ్ లో రాత్రి పది తర్వాత భోజనం చేసే వారి సంఖ్య మరింత పెరుగుతుంది. దీంతో తినగానే వెంటనే నిద్ర పోయే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. దీనివల్ల ఊబకాయం, డయాబెటిస్ వంటి సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కానీ రాత్రి తినకుండా ఉండటం కూడా మంచిది కాదు. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయట.

    రాత్రి పూట పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉండడం ప్రమాదకరం. దీనివల్ల ఇన్సులిన్ స్థాయిలు క్షీణిస్తాయి. తద్వారా శరీరంపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది. రాత్రిపూట ఆహారం తీసుకోకపోతే గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు పెరుగుతాయట. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే అల్సర్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా మొదలవుతాయి అంటున్నారు నిపుణులు.

    రాత్రిళ్లు తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. పైగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది కానీ పూర్తిగా ఆహారం తీసుకోవడం మానేస్తే చాలా సమస్యలు మాత్రం ఎదుర్కోవాల్సి వస్తుంది. గుండెలో మంట, పుల్లని త్రేన్పులు వంటి సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని చెబుతున్నారు నిపుణులు. మరి తెలుసుకున్నారు కదా ఆహారం సరిగా తీసుకోకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో.. ఇప్పుడు అయినా మీ డైట్ ను మార్చుకోండి.