https://oktelugu.com/

Mangoes In Fridge: మామిడి పండ్లను ఫ్రిజ్ లో పెడుతున్నారా? మీ పని అంతే…

చాలామంది మామిడి పండ్లను కొంటారు. మార్కెట్లో పండ్లు ఎప్పుడు వస్తాయో అని.. లేదా తియ్యగా ఉన్నాయని ఎక్కువ మొత్తంలో తీసుకొని ఫ్రిజ్ లో పెడుతుంటారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 3, 2024 / 12:38 PM IST

    Mangoes In Fridge

    Follow us on

    Mangoes In Fridge: పండ్లలో రారాజు ఏదంటే ఆలోచించకుండా చెప్పే పేరు మామిడి పండు. వేసవి వచ్చింది ఇక మామిడి పండ్లు కూడా నోరూరిస్తుంటాయి. మార్కెట్ కు వెళ్తే చాలు ఎన్నో రకాల మామిడి పండ్లు ఉంటాయి. అందులో కొన్ని తియ్యటివి, కొన్ని పుల్లగా కూడా ఉంటాయి. అయినా సరే మామిడి పండ్లను ఇష్టపడనివారు ఉంటారా? పిల్లల నుంచి పెద్దల వరకు ఈ పండ్లను లాగించేస్తుంటారు. ఇక వేసవిలో దొరికే ఈ పండ్ల గురించి ఓ విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

    చాలామంది మామిడి పండ్లను కొంటారు. మార్కెట్లో పండ్లు ఎప్పుడు వస్తాయో అని.. లేదా తియ్యగా ఉన్నాయని ఎక్కువ మొత్తంలో తీసుకొని ఫ్రిజ్ లో పెడుతుంటారు. మరి మామిడి పండ్లను ఫ్రిజ్ లో పెట్టవచ్చా? లేదా? ఈ డౌట్ ల గురించి పోషకాహార నిపుణులు ఏం అంటున్నారో తెలిస్తే మీ అలవాటు మానుకుంటారు. అయితే మామిడి పండ్లను ఫ్రిజ్ లో ఎక్కువ రోజులు పెట్టకూడదు అంటున్నారు నిపుణులు. వీటిని ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో ఉంచడం వల్ల మామిడి పండ్లలో ఉండే పోషకాలు అన్నీ ప్రభావితం అవుతాయట.

    దీనివల్ల పోషకాలు శరీరానికి అందవు. అలాంటప్పుడు మామిడి పండ్లను తిని లాభం ఏంటి? మరి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎలా అని ఆలోచిస్తున్నారా. మామిడి పండ్లను కొనే ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే పెద్దగా టెన్షన్ ఉండదు. పూర్తిగా పండిన పండ్లు కాకుండా కొంచెం పండిన పండ్లు తీసుకోవాలి. దీంతో ఒకేసారి మొత్తం పాడవవు. ముందుగా ఎక్కువ పండిన పండ్లు తింటూ ఉంటే మిగిలినవి పండుతూ ఉంటాయి. కొన్ని సార్లు తడి గుడ్డలో పెట్టినా కూడా తొందరగా పాడు కావు. మరి ఇంకెందుకు ఆలస్యం మామిడి పండ్లు వస్తున్నాయి లాగించేసేయండి.