https://oktelugu.com/

Curd : పెరుగు ఈ సమయంలో తింటున్నారా.. అయితే జాగ్రత్త!

ఏదో విధంగా పెరుగును డైట్ లో చేర్చుకోవాలి. అయితే పెరుగును కొన్ని సమయాల్లో మాత్రమే తినాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి రోజులో ఏ సమయంలో పెరుగు తినాలో తెలుసుకుందాం.

Written By:
  • NARESH
  • , Updated On : September 6, 2024 / 12:32 AM IST

    Curd

    Follow us on

    Curd :  భోజనం చేసిన తరువాత పెరుగుతో అన్నం తినకపోతే అసలు తిన్న తృప్తి కూడా ఉండదు. పెరుగు అన్నం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కొందరికి పెరుగు నచ్చదు. కనీసం దాని వాసన కూడా చూడటానికి ఇష్టపడరు. రోజూ పెరుగు తినడం వల్ల అందులోని పోషకాలు బాడీకి అందుతాయి. ఏదో విధంగా పెరుగును డైట్ లో చేర్చుకోవాలి. అయితే పెరుగును కొన్ని సమయాల్లో మాత్రమే తినాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి రోజులో ఏ సమయంలో పెరుగు తినాలో తెలుసుకుందాం.

    పెరుగులో ప్రోబయోటిక్స్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంతో పాటు కండరాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పెరుగు రోజూ తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. అయితే పెరుగును రాత్రి పూట తినకూడదు. రోజులో ఏ సమయంలో తిన్నా పర్లేదు. రాత్రిపూట పెరుగు తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. సాధారంగా రాత్రిపూట ఏ ఫుడ్ తిన్నా సరిగ్గా జీర్ణం కాదు. కాబట్టి రాత్రి పూట అసలు పెరుగు జోలికి వెళ్లవద్దు. పెరుగు ఉదయం లేదా మధ్యాహ్నం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. బ్రేక్ ఫాస్ట్ లో పెరుగు తీసుకుంటే.. రోజంతా యాక్టివ్ గా ఉంటారు. శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. అలాగే జీర్ణ క్రియ కూడా తొందరగా మెరుగు అవుతుంది.

    పెరుగును నెయ్యి, చేపలు వంటి వాటితో తినకూడదు. అధిక కొవ్వు, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు పెరుగును తక్కువగా తీసుకోవడం మంచిది. ఇందులో కాల్షియం, విటమిన్​ బి12, పొటాషియం, లాక్టిక్​ ఆమ్లం, ప్రోబయోటిక్స్ వంటివి ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడంలో సాయపడతాయి. పెరుగు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే పెరుగు ఎక్కువగా తీసుకుంటే బాడీకి వేడి చేస్తుంది. పెరుగును మజ్జిగగా చేసి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు ఎక్కువగా పెరిగే వాళ్లు తినకపోవడం మంచిది. పెరుగు ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. అలాగే అలెర్జీ, అసిడీటీ, అజీర్ణం సమస్యలు ఉన్నవాళ్లు దీనికి దూరంగా ఉండటం బెటర్.

    కొంతమందికి పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ఆర్థరైటిస్ ఉన్నవాళ్లు పెరుగు తినకపోవడం మంచిది. కొందరి బాడీకి పాల ఉత్పత్తులు సెట్ కాకపోవడంతో.. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అలాంటి వాళ్లు పెరుగుకి దూరంగా ఉండాలి. పెరుగుతో కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. పేస్ కి, కురులకు పెరుగు అప్లై చేయడం వల్ల అందం పెరగడంతో పాటు జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.