https://oktelugu.com/

Upma : ఉప్మానే అని చీప్ గా చూడద్దు.. దీని ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు

ఉప్మాలో చాలా రకాల వెరైటీలు ఉన్నాయి. అయితే ఎక్కువగా వెజిటేబుల్ ఉప్మా చేస్తుంటారు. ఇందులో వెల్లుల్లి, అల్లం, బీన్స్, క్యారెట్, శెనగలు వంటివి వేస్తారు. ఇందులో ఉండే పోషకాలు, మినరల్స్ శరీర ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి రోగ నిరోధక శక్తి పెరిగేలా చేయడంతో పాటు.. జలుబు, దగ్గు, సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : September 6, 2024 / 01:27 AM IST

    Upma

    Follow us on

    Upma : ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తారా డైలాగ్ ఎంత ఫేమస్ మీకు తెలిసిందే. చాలా మంది మధ్య తరగతి ఇంట్లో ఉప్మా టిఫిన్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఉప్మా ఎవరికి నచ్చదు. తక్కువ ఖర్చుతో తొందరగా అవుతుందని టిఫిన్ లో దీనినే ఎక్కువగా వాడుతారు. ఉప్మా టిఫిన్ ఉన్న రోజూ ఆ ఇంట్లో గొడవ తప్పనిసరిగా ఉంటుంది. టిఫిన్ చేయడం మానేస్తారు ఏమో.. కానీ ఉప్మా మాత్రం తినరు. హాస్టలర్స్ అయితే ఉప్మా అని తెలిస్తే అసలు ఆరోజు కిచెన్ ముఖం కూడా చూడరు. ఇంతకు ముందు రోజుల్లో పెళ్లిళ్లలో టిఫిన్ కింద ఉప్మాని ఎక్కువగా చేసేవారు. ఎందుకు అంటే తొందరగా ఈ టిఫిన్ అయిపోతుంది. అందుకే దీనిని అధికంగా చేసేవారు. అయితే చాలా మంది ఉప్మా అని తినకుండా చీప్ గా చూస్తారు. కానీ దీనిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు. అన్ని కూరగాయలు కలిపి ఉప్మాని చేయడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. మరి ఈ ఉప్మా రోజూ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

    ఉప్మాలో చాలా రకాల వెరైటీలు ఉన్నాయి. అయితే ఎక్కువగా వెజిటేబుల్ ఉప్మా చేస్తుంటారు. ఇందులో వెల్లుల్లి, అల్లం, బీన్స్, క్యారెట్, శెనగలు వంటివి వేస్తారు. ఇందులో ఉండే పోషకాలు, మినరల్స్ శరీర ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి రోగ నిరోధక శక్తి పెరిగేలా చేయడంతో పాటు.. జలుబు, దగ్గు, సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుంది. ఉప్మా తింటే తొందరగా జీర్ణం అవుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లకి ఉప్మా బాగా ఉపయోగపడుతుంది. దీని వల్ల కడుపులో మంట, నొప్పి, మాలబద్దకం సమస్యలు కూడా తగ్గుతాయి. ఉప్మాలో పీచు పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తొందరగా ఆకలి వేయకుండా కాపాడుతుంది. దీనివల్ల ఈజీగా బరువు తగ్గుతారు. బరువు తగ్గాలి అనుకునే వాళ్లకి ఇది బెస్ట్ ఫుడ్. ఉప్మా తినడం వల్ల బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనివల్ల గుండె సమస్యలు కూడా రావు. ముఖ్యంగా గోధుమ రవ్వతో చేసిన ఉప్మా తింటే.. ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా రావు. చాలా మందికి తక్కువగా రక్తం ఉంటుంది. దీంతో రక్తహీనత వస్తుంది. అలాంటివాళ్లు రోజూ ఉప్మా తింటే ఈ సమస్య తీరిపోతుంది. ఇప్పుడు అయితే ఓట్స్ ఉప్మా, సేమియా ఉప్మా, అటుకుల ఉప్మా ఇలా రకరకాలుగా ఉన్నాయి. కానీ అప్పటిలో ఎక్కువగా రవ్వ ఉప్మానే తినేవారు. ఓట్స్ ఉప్మా ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. తినడానికి ఇష్టం లేకపోయిన రోజు ఉప్మా తినండి. ఇలా తింటే.. రోజంతా యాక్టీవ్ గా ఉంటారు. ఉప్మా కదా అని చీప్ గా తీసిపారేయవద్దు.