Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు సర్వార్ద సిద్ధియోగం, కాలయోగం ఏర్పడనున్నాయి. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని పనుల కోసం డబ్బును ఖర్చు పెడుతారు. ఉద్యోగుల కార్యాలయాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృద్ధులకు సాయం చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.
వృషభ రాశి:
కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. ఉపాధ్యాయ రంగానికి చెందిన వారికి అనుకోని ఆదాయం వస్తుంది. స్నేహితులతో సరదాగా ఉంటారు.
మిథున రాశి:
వ్యాపారులు కొత్త పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. బిజీ షెడ్యూల్ కారణంగా మానసికంగా ఆందోళనతో ఉంటారు. వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
కర్కాటక రాశి:
వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు.
సింహారాశి:
ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. పెండింగులో ఉన్న సమస్యలు పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభం ఉంటుంది.
కన్య రాశి:
ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో ఏదైనా వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది. కొన్ని వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ పొందే అవకాశం. ఈ కారణంగా ఉల్లాసంగా ఉంటారు.
తుల రాశి:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.
వృశ్చిక రాశి:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. శత్రువులు హాని చేసే అవకాశం ఉంది.
ధనస్సు రాశి:
కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వివాహ ప్రతిపాదనలు వస్తాయి. మానసికంగా ఒత్తిడికి గురవుతారు. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి.
మకర రాశి:
వ్యాపారులు కొన్ని శుభవార్తలు వింటారు. ఆదాయం పెరిగినా ఖర్చులు ఉంటాయి. వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. అదనపు ఖర్చులు ఉంటాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి.
కుంభరాశి:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. చట్టపరమైన చిక్కుల్లో పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి:
మానసిక భారం నుంచి విముక్తి పొందుతారు. తల్లిదండ్రుల కోసం సమయాన్ని వెచ్చిస్తారు. విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది.