Homeహెల్త్‌Viagra for Women : అసలు మహిళలకు వయాగ్రా ఉంటుందా? ఇది ఎలా పనిచేస్తుందో మీకు...

Viagra for Women : అసలు మహిళలకు వయాగ్రా ఉంటుందా? ఇది ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా?

Viagra for Women : : పురుషులకు వయాగ్రా ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ మహిళకు కూడా వయాగ్రా ఉందని చాలా తక్కువమందికి తెలుసు. పురుషులు వాళ్ల లైంగిక కోరికలు గురించి వాళ్ల స్నేహితులు, భార్య లేదా ఇష్టమైన వాళ్లతో చర్చించుకుంటారు. కానీ మహిళలు మాత్రం అసలు వీటి గురించి ఎవరి దగ్గర మాట్లాడరు. లైంగిక పరంగా ఏదైనా సమస్య ఉన్నా కనీసం వైద్యులతో కూడా చర్చించరు. అయితే పురుషుల్లో లైంగిక కోరికలను పెంచడానికి వయాగ్రా వాడుతారు. ఆడవాళ్లలో కూడా దీనికోసమే వయాగ్రాని వాడుతారు. అయితే మహిళల వయాగ్రా ఏంటి? దీని గురించి పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

పురుషులు వాళ్ల లైంగిక కోరికలను పెంచుకోవడానికి వాడినంతగా మహిళలు వాడరు. అయితే మహిళల లైంగిక కోరికలు పెంచుకోవడానికి మార్కెట్లో చాలా రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి. అందులో ఫ్లిబాన్సేరిన్ ఒకటి. దీనిని మహిళల వయాగ్రా చెబుతుంటారు. దీనిని మహిళలు వాడటం వల్ల డోపమైన్, నోర్‌పైన్‌లను ప్రభావితం చేస్తుంది. లైంగిక కోరికలను పెంచడానికి ఇది సహాయపడుతుంది. వ్యక్తిగత కారణాలు లేదా ఇంకా వేరే కారణాల వల్ల లైంగికంగా కోరికలను కోల్పోయిన మహిళలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే మహిళల్లో ఈ వయాగ్రా సానుకూలంగా ఉంది. మగవారి వయాగ్రాను మాత్రం మహిళలు తీసుకోకూడదు. ఎందుకంటే పురుషులు, మహిళలు వేర్వేరు శరీరాలను కలిగి ఉన్నందున డిఫరెంట్‌గా ప్రభావితం చేస్తుంది. అయితే మహిళలు వయాగ్రా తీసుకున్న తర్వాత వాళ్లు మైకం, నిద్ర సమస్యలు, వికారం, అలసట, నోరు పొడిబారడం, అధిక రక్తపోటు వంటి వాటితో ఇబ్బంది పడతారు.

చాలామంది మహిళలు వ్యక్తిగత కారణాలు, ఒత్తిడి వల్ల లైంగిక కోరికలపై ఆసక్తి కోల్పోతారు. అలాగే మోనోపాజ్ లేదా ప్రెగ్నెన్సీ వంటి కారణాల వల్ల కూడా మహిళలు లైంగిక కోరికలపై ఇంట్రెస్ట్ పోతుంది. అలాగే గతంలో జరిగిన ఇబ్బందుల వల్ల మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల లైంగిక కోరికలు తగ్గుతాయి. అలసట, మధుమేహం, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి కొన్ని వ్యాధుల వల్ల కూడా లైంగికంగా ఆసక్తి కోల్పోతారు. అధికంగా శారీరక శ్రమ, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలకు తల్లులగా ఉన్న మహిళల వాళ్ల లైంగిక కోరికలను తొందరగా కోల్పోతారు. అయితే వీటి గురించి మహిళలు చాలా పెద్దగా ఎవరితో చర్చించరు. మాట్లాడితే ఏమైనా అనుకుంటారు ఏమో అని భావించి కనీసం భర్తతో కూడా షేర్ చేసుకోరు.

 

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version