https://oktelugu.com/

health : ఇవి ఆరోగ్యం అనుకొని లాగించేస్తున్నారా? మంచివే కానీ చెడ్డవి కూడా..

కొన్నిఆహారాలు ఆరోగ్యం అనుకొని తింటారు. నిజంగా అవి ఆరోగ్యకరమే.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 5, 2024 / 03:31 PM IST

    health

    Follow us on

    health : కొన్నిఆహారాలు ఆరోగ్యం అనుకొని తింటారు. నిజంగా అవి ఆరోగ్యకరమే. కానీ వాటికి ఇతర పదార్థాలు కలిసినప్పుడు, లేదంటే వాటిని సపరేట్ గా ఇతర పదార్థాల ద్వారా తయారు చేసినప్పుడు మాత్రం అవి ఎలాంటి ప్రయోజనం లేని పదార్థాలుగా అవుతాయి. అందుకే ఆరోగ్యం అనుకొని వాటితో ఏది పడితే ఆ పదార్థాలు తయారు చేయడం మంచిది కాదు. ఆహారం విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలే మీ ఆ ఆరోగ్యాన్ని కాపాడుతుంటాయి. అయితే రుచిగల యోగర్ట్‌ల నుంచి ప్రోటీన్ బార్ ల వరకు మీరు అనుకున్నంత ఆరోగ్యకరం కాని “ఆరోగ్యకరమైన ఆహారాలు” కొన్ని ఉన్నాయి. ఇంతకీ అవేంటి అనుకుంటున్నారా? అయితే ఓ సారి చూసేయండి.

    గ్రానోలా వినే ఉంటారు. తినే ఉంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి అని అంటారు. అయినప్పటికీ, చాలా గ్రానోలా బార్‌లు అదనపు చక్కెరతో నిండి ఉంటాయి. కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో కొందరికి ఇవి చెడు ప్రభావాలను చేకూరుస్తాయి. అయితే పెరును తినడం చాలా మందికి ఇష్టమే కదా. కానీ పెరుగు ప్రతి ఒక్కరికి మంచి ప్రయోజనాలను అందించదు. ఎందుకంటే పెరుగు ఒక ఆరోగ్యకరమైన ఎంపిక కావచ్చు, కానీ రుచిగల పెరుగులు కేవలం ఒక చిన్న సర్వింగ్‌లో ఆశ్చర్యకరమైన చక్కెరను కలిగి ఉంటాయి అని మీకు తెలుసా. అందుకే ఇది కూడా మంచిదే అయినా చెడ్డది కూడా.

    ప్రోటీన్ డ్రింక్స్ చాలా ఆరోగ్యకరమైనవే. కానీ కాదు కూడా. ఎందుకంటే వీటిలో చాలా వరకు చక్కెర యాడ్ చేస్తారు. కృత్రిమ రంగులు వంటి అనవసరమైన పదార్థాలు కూడా చాలా ఉంటాయి. ఇక స్పోర్ట్స్ డ్రింక్స్, ఎనర్జీ పానీయాలను కూడా చాలా మంది తీసుకుంటారు. కానీ చక్కెర, కృత్రిమ రంగులు, కెఫిన్ వంటి పెద్ద మొత్తంలో ఉత్ప్రేరకమైన పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ప్రాసెస్ చేసిన గ్లూటెన్-ఫ్రీ స్నాక్ ఫుడ్స్, స్వీట్‌లు ఇతర స్నాక్స్‌ల మాదిరిగానే ఎక్కువ కాకపోయినా కాస్తైన అధిక కేలరీలు, చక్కెరను కలిగి ఉంటాయి.

    అల్పాహారంగా తీసుకునే తృణధాన్యాలు శుద్ధి చేసిన ధాన్యాలతో తయారు చేస్తారు. ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు తక్కువ. అంతేకాదు చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఇంట్లో తయారుచేసిన స్మూతీలు పోషకమైన ఎంపిక కావచ్చు, అయితే, ముందుగా తయారుచేసిన స్మూతీలు భారీ మొత్తంలో కేలరీలు, చక్కెరను కలిగి ఉంటాయి. సో వీటిని మీరు తీసుకోవాలి అనుకుంటే కాస్త జాగ్రత్త మస్ట్. డైట్ సోడాలో షుగర్ లేనప్పటికీ, డైట్ సోడా తాగని వారి కంటే రెగ్యులర్ డైట్ సోడా తాగే వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

    కొన్ని శాకాహారి మొక్కల ఆధారిత మాంసం పునఃస్థాపన ఉత్పత్తులు అల్ట్రా-ప్రాసెస్ చేయబడిన పదార్థాలు, ఉప్పు, చక్కెర మరిన్నింటితో నిండి ఉంటాయి. ఘనీభవించిన పెరుగు రుచికరమైనది కావచ్చు. కానీ సాధారణ ఐస్ క్రీం కంటే ఇది ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఎంపిక కాదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇందులో చక్కెర యాడ్ అవుతుంది.