Ram Prasad Car Accident : తన కామెడీ టైమింగ్ తో, పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ కారు తుక్కుగూడ ఔటర్ రోడ్డు వద్ద తీవ్రమైన ప్రమాదానికి గురైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రామ్ ప్రసాద్ షూటింగ్ కి వెళ్తున్న సమయంలో తుక్కుగూడ సమీపంలో ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న రామ్ ప్రసాద్ కారు, ముందు ఉన్న కారుకు గుద్దుకొని ప్రమాదానికి గురైంది. రామ్ ప్రసాద్ కారు ముందు భాగం బాగా దెబ్బ తినింది. అదృష్టం కొద్దీ రామ్ ప్రసాద్ కి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. కానీ దెబ్బలు మాత్రం బాగానే తగిలాయి. సమీపం లో ఉన్న ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఒక రెండు రోజులు,లేదా వారం రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరికొన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది ఇలా ఉండగా ఆటో రాంప్రసాద్ ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా ఎంతటి పాపులారిటీ ని సంపాదించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సుడిగాలి సుధీర్ టీం లో ఉంటూ, స్కిట్స్, డైలాగ్స్ రాస్తూ, అదిరిపోయే పంచులు వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని తెచ్చుకున్నాడు. ఇతనితో పాటు స్కిట్స్ చేస్తూ వచ్చిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వంటి వారు ఇప్పుడు సినీ ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ కమెడియన్స్ గా దూసుకుపోతుంటే, గెటప్ శ్రీను మాత్రం ఇంకా జబర్దస్త్ లోనే కొనసాగుతున్నాడు. ఆడపడదపా సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ, వాళ్ళిద్దరి రేంజ్ లో మాత్రం అవకాశాలను సంపాదించలేకపోతున్నాడు ఆటో రామ్ ప్రసాద్. ఇప్పటికీ జబర్దస్త్ లో కొనసాగుతున్న పాత కంటెస్టెంట్స్ లో ఆటో రామ్ ప్రసాద్ ఒకడు. కేవలం ఈయన స్కిట్స్ కోసమే జబర్దస్త్ ని ఇప్పటికీ చూస్తున్నారు ఆడియన్స్.
ఇప్పటి వరకు ఆటో రామ్ ప్రసాద్ దాదాపుగా 30 సినిమాల్లో నటించాడు. టీవీ షోస్ మాత్రం దాదాపుగా ఈటీవీ లో ప్రసారమయ్యే ప్రతీ ఎంటర్టైన్మెంట్ షోస్ లో ఆటో రామ్ ప్రసాద్ ఉన్నాడు. సినిమాల్లో ఆయనకీ రీసెంట్ గా విడుదలైన ‘బెదురులంక’ చిత్రం మంచి పేరుని తీసుకొచ్చింది. ఈ చిత్రం తర్వాత ప్రస్తుతం ఆయన నాలుగు సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నాడు. అంతే కాకుండా ఈయన హీరో గా ‘పీప్ హోల్’ అనే సినిమా కూడా తెరకెక్కింది. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకు ముందు ఈయన తన టీం మేట్స్ గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ తో కలిసి ‘3 మంకీస్’ అనే చిత్రం చేసాడు. కమర్షియల్ గా ఈ సినిమా థియేటర్స్ లో వర్కౌట్ అవ్వలేదు కానీ, ఓటీటీ లో మాత్రం మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.