Gods in Home : వాస్తు ప్రకారం మన ఇంట్లో కూడా దేవతలు తిరుగుతుంటారని చెబుతారు. కానీ ఇదంతా వట్టిదే అనే వారు కూడా ఉన్నారు. కానీ ఇందులో నిజం ఉందని కొందరు వాదిస్తుంటారు. మన ఇంట్లో దేవతలు ఉన్నారనడానికి కొన్ని సాక్ష్యాలు కూడా సూచిస్తున్నారు. వాటి ప్రకారం చూస్తే మన ఇంట్లో దేవతలు సంచరించడం నిజమే అంటున్నారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలు దేవతలు మన ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటారట.
మన ఇంట్లో దేవతలు ఉన్నారనడానికి సాక్ష్యం ఉదయం పూట కాకి మన ఇంటి చుట్టు అరిస్తే మన ఇంట్లో దేవతలు ఉన్నట్లే. కాకికి దేవుళ్లకు దగ్గర సంబంధం ఉంటుందని చెబుతారు. ఉదయం సమయంలో ఉడత కనిపించినా మన ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఇంకా బల్లులు కనిపిస్తే మనం అసహ్యించుకుంటాం. కానీ బల్లులు కూడా దైవానుగ్రహమే.
మన వంటింట్లో, పూజ గదిలో బల్లులు కనిపిస్తే వాటిని పారదోలుతాం. కానీ వాటిని ఏమి అనవద్దు. అవి కూడా లక్ష్మీదేవి స్వరూపమే. బల్లులు కూడా మన ఇంట్లో దేవతలున్నారని సూచిస్తాయట. ఇలా మనకు రకరకాల సంకేతాలు రావడంతో మనం గుర్తించలేకపోతుంటాం. కానీ దేవతలు మన ఇంట్లో తిరుగుతుంటారని ఈ ఆనవాళ్ల ద్వారా తెలుసుకోవాలి.
ఇంట్లో దీపారాధన చేసినప్పుడు కూడా దీపం గాలి రాకున్నా అటు ఇటు ఊగినట్లు అనిపిస్తుంది. నూనె అయిపోయినా వెలుగుతుంది. ఈ సంకేతాలు మన ఇంట్లో కూడా దేవుళ్లు ఉన్నారని తెలిపే సాక్ష్యాలు. దీంతో మనం ఎప్పుడు కూడా ఇంట్లో దేవతలు ఉన్నారనే ఉద్దేశంతోనే మెలగాలి తప్ప దేవుళ్లు లేరని అనుకోవద్దని పండితులు చెబుతున్నారు.