https://oktelugu.com/

Fat vs Weight : కొవ్వు తగ్గడం, బరువు తగ్గడం రెండూ ఒకటేనా? రెండింటి మధ్య తేడాలు ఏంటంటే?

డయాబెటీస్, బీపీ వంటి సమస్యలు ఉన్నవారు కాస్త ఆహారం విషయంలో జాగ్రత్త వహించాల్సిందే. అందుకే ఎలాంటి మార్పులు చేసుకోవాలనుకున్నా ఒకసారి డాక్టర్ సలహా ఉత్తమం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 13, 2024 / 07:12 AM IST

    Fat Health Problems

    Follow us on

    Fat vs Weight  బరువు తగ్గడానికి, కొవ్వు తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మీరు కూడా చేస్తున్నారా? అయితే ఈ ప్రయత్నంలో తెలియకుండానే చాలా తప్పులు చేస్తుంటారు. అనుకున్నదే తడువుగా ఒకేసారి బరువు తగ్గాలి అని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇలా చేయకూడదు. ఇలా చేయడం వల్ల సమస్య తీరడం కాదు కదా. మరింత ఎక్కువ అవుతుంది అంటున్నారు నిపుణులు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కాలంలో చాలా రకరకాల ఆహారపు అలవాట్లతో, బద్ధకం, స్థూలకాయం, జీన్స్ వంటి కారణాల వల్ల బరువు పెరగడం కామన్ గా మారింది. కొందరు బరువు నిరంతరం పెరుగుతున్నా పెద్దగా పట్టించుకోరు.

    మీరు ఒక విషయం గమనించారా? బరువు తగ్గడం, కొవ్వు తగ్గడం ఒకేటేనా? ఈ అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా? చాలా మంది బరువు తగ్గడం, కొవ్వు తగ్గడం ఒక్కటే అనుకుంటారు. కానీ ఈ రెండింటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే మీ బరువు కొవ్వు తగ్గించడం సులభం అవుతుంది.

    బరువు తగ్గడానికి, మీ శరీరంలో కొవ్వును కరిగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? మీరు ఈ ప్రయత్నంలో ఉంటే ఖచ్చితంగా ఈ రెండింటి మధ్య తేడాను తెలుసుకోవాలి. అప్పుడే మీరు ఎలాంటి సమస్యను ఫేస్ చేయరు. లేదంటే సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.
    బరువు తగ్గడం అంటే.. శరీర బరువును తగ్గించుకోవడం. ఇందులో కండరాలు, కొవ్వులు, నీటి బరువు మొదలైనవి రకరకాలుగా ఉంటాయి అంటున్నారు నిపుణులు.. తక్కువ కేలరీల ఆహారం, యోగా, వ్యాయామంతో సహా ఇతర మార్గాల్లో బరువు తగ్గడం సులభమే.

    కానీ శరీరంలో కొవ్వు ఉంటే మాత్రం తీరని నష్టమే.ఈ విషయం అందరికీ తెలిసినా సరే కామన్ అంటూ లైట్ తీసుకుంటారు. కానీ మీరు శరీరంలో కొవ్వు పరిమాణం పెరగడం ప్రారంభిస్తే మాత్రం.. అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తుంటాయి. ఇలా శరీరంలో కొవ్వును తగ్గించడాన్ని ఫ్యాట్ లాస్ అంటారు. సాధారణంగా బరువు తగ్గడం కంటే కొవ్వు తగ్గడం మంచిది.

    కొవ్వు తగ్గించుకోవడానికి కొన్ని వ్యాయామాలు చేస్తే శరీర ఆకృతి అందంగా మారుతుంది. వ్యాయామాలు బెటర్. కానీ కొందరు శరీరంలో పేరకుపోయిన కొవ్వును తగ్గించుకోవడం కోసం సర్జరీలు చేసుకుంటున్నారు. ఇలా చేయడం మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

    ప్రస్తుతం బరువు పెరగడం అనేది చాలా పెద్ద సమస్య. ఎవరిని చూసినా తినే ఆహారం వల్ల బరువు పెరుగుతున్నారు. ఆహార అలవాట్లు, బిజీ జీవనశైలి వంటివి మనుషులను ఇబ్బంది పెడుతున్నాయి. అంతేకాదు సరైన ఆహారాన్ని తీసుకోకుండా, కేవలం పని, పని అంటూ పరుగెడుతున్నారు. కాస్త శరీరం గురించి ఆలోచించడం వల్ల మీకు ఉన్న ఎలాంటి సమస్యలు అయినా తీర్చుకోవచ్చు. సరైన ఆహారం వల్ల బరువు సమస్యను మాత్రమే కాదు శరీరం మొత్తానికి సంబంధించిన చాలా సమస్యలను తీర్చుకోవచ్చు కాబట్టి జాగ్రత్త. ఆహారం విషయంలో మీ వైద్యులను సంప్రదించడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది. డయాబెటీస్, బీపీ వంటి సమస్యలు ఉన్నవారు కాస్త ఆహారం విషయంలో జాగ్రత్త వహించాల్సిందే. అందుకే ఎలాంటి మార్పులు చేసుకోవాలనుకున్నా ఒకసారి డాక్టర్ సలహా ఉత్తమం.