https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశి వ్యాపారులకు శత్రువుల బెడద ఎక్కువ.. కొత్త వారిని గమనిస్తూ ఉండాలి..

ఉద్యోగులు కార్యాలయాల్లో తోటివారితో సంయమనం పాటించాలి. అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి వాదనలకు దిగొద్దు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సాయంత్రి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 13, 2024 / 08:11 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులపై ఈరోజు విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. మంగళవారం చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ఇంద్ర యోగం ఏర్పడనుంది. అలాగే మంగవారం సందర్భంగా కొన్ని రాశుల వారిపై ఆంజనేయుడి ప్రభావం ఉంటుంది. దీంతో వ్యాపారులు, ఉద్యోగులు ధైర్యంగా కొన్ని పనులు చేయగలుగుతారు. మరో రాశి వ్యాపారులకు అడ్డంకులు ఏర్పడుతాయి. వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. ప్రతికూల వాతావరణం ఉండే అవకాశం జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. పెండింగ్ సమస్యలు పూర్తి చేస్తారు.

    వృషభ రాశి:
    ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటారు. ప్యానాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం ఓ శుభవార్త అందుకుంటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తారు.

    మిథున రాశి:
    వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆకస్మికంగా కొన్ని సమస్యలు వస్తాయి. జీవితంలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. జీవిత భాగస్వామితో కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులు అనుకోని లాభాలు పొందుతారు. కొత్త వారితో జాగ్రత్తగా ఉండాలి.

    కర్కాటక రాశి:
    సమాజంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు కెరీర్ కు సంబంధించి కష్టపడుతారు. ఏదైనా కొత్త పెట్టుబడులు పెడితె తల్లిదండ్రుల సహాయం తీసుకోవాలి. ఉద్యోగులు తోటివారితో సంయమనం పాటించాలి. సీనియర్ల మద్దతు పొందాలి.

    సింహారాశి:
    జీవిత భాగస్వామితో సరదాగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు భాగస్వాములతో జాగ్తత్తగా ఉండాలి. శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు.

    కన్య రాశి:
    వ్యాపారులు అనూహ్యంగా లాభాలు పొందుతారు. సాయంత్రి కుటుంబ సభ్యులతో సరదాగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితిపై తెలుసుకోవాలి. పిల్లల కెరీర్ కు సంబంధించి ఒక అంచనాకు వస్తారు.

    తుల రాశి:
    మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొందరు ప్రయత్నిస్తారు. విదేశాల్లో విద్యనభ్యసించే వారు శుభవార్తలు వింటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఒకే పనులు ఏకకాలంలో నిర్వహించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. తెలివితో కొన్ని పనులు ఈజీగా చేయగలుగుతారు.

    వృశ్చిక రాశి:
    సీనియర్ అధికారుతో ఉద్యోగులకు కొన్ని వివాదాలు ఉంటాయి. వ్యాపారులు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. రాజకీయ రంగాల్లో ఉన్నవారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. కష్టపడి పనిచేసిన వారికి ఫలితం ఉంటుంది.

    ధనస్సు రాశి:
    ఉద్యోగులు కార్యాలయాల్లో తోటివారితో సంయమనం పాటించాలి. అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి వాదనలకు దిగొద్దు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సాయంత్రి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

    మకర రాశి:
    ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు తల్లి మద్దతు ఉంటుంది. దీంతో అనూహ్య లాభాలు పొందుతారు. బ్యాంకు నుంచి రుణం తీసుుకంటే కలసి వస్తుంది. కుటుంబ ఆస్తి పెరిగే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

    కుంభరాశి:
    జీవిత భాగస్వామితో కొన్ని వాదనలు ఉంటాయి. ఆధ్యాత్మికపై ఆసక్తి పెంచుకుంటారు. మతపరమైన ప్రదేశాలను సందర్శిస్తారు. కొత్త పెట్టుబడుల కోసం ప్లాన్ చేస్తారు. గృహానికి సంబంధించి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎక్కువగా వాదనలు చేయకుండా ఉండాలి.

    మీనరాశి:
    వివాహ ప్రయత్నాలు ప్రారంభం అవుతాయి. శత్రువుల మీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు. అయితే వారికి భయపడకుండా ఉండాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. విద్యార్థులు కొత్త అవకాశాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో సరదాగా ఉంటారు.