Hair Health: తెల్ల జుట్టుకు మెహందీని పెడుతున్నారా? అయితే..

తెల్ల వెంట్రుకల సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది హెన్నాను కూడా వాడుతుంటారు. ఇది జుట్టుకు మంచి రంగును ఇస్తుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Written By: Swathi, Updated On : June 8, 2024 6:41 pm

Hair Health

Follow us on

Hair Health: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ తెల్ల జుట్టు వస్తుంది. చిన్న వయసు వారు సైతం జుట్టు తెల్లగా మారిపోతుంది. అయితే తెల్ల వెంట్రుకలు కనిపించకుండా ఉండేదుకు మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్టులను వాడుతుంటారన్న సంగతి తెలిసిందే. కానీ మళ్లీ రెండు, మూడు రోజుల్లోనే తెల్ల వెంట్రుకలు కనిపిస్తుంటాయి. అంతేకాదు రంగుల్లో ఉండే కెమికల్స్ వలన వెంట్రుకలు దెబ్బతింటాయి.

తెల్ల వెంట్రుకల సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది హెన్నాను కూడా వాడుతుంటారు. ఇది జుట్టుకు మంచి రంగును ఇస్తుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెహందీలో ఉండే విటమిన్ సి మరియు డి, నికోటినిక్ యాసిడ్ వంటి పలు పోషకాలు జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ క్రమంలోనే తెల్ల జుట్టు కలిగి ఉన్న వారు హెన్నాలో ఈ పదార్థాన్ని కలిపి పెట్టడం వలన ఇంకా మంచి ఫలితాన్ని పొందవచ్చని చెబుతున్నారు. ఇంతకీ ఏంటది? దీన్ని జుట్టుకు ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.

హెన్నాలో ఉసిరి పొడిని కలిపి జుట్టుకు పట్టించాలని, దీని వలన వెంట్రుకలు నల్లగా మారతాయని చెబుతున్నారు. ఉసిరికాయలో విటమిన్ సి, ఫైటోన్యూట్రియెంట్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయట. ఉసిరి జుట్టుకు పోషణ అందించడంతో పాటు జుట్టు బాగా పెరగడానికి సహాయపడుతుంది.

ఉసిరి పొడి, హెన్నాను కలిపి జుట్టుకు పట్టించడం వలన మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఈ రెండింటిలోనూ ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును నల్లగా మార్చేందుకు సహాయపడుతుంది. అంతేకాదు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడకుండా రక్షిస్తుంది. ఇందుకోసం ఒక గిన్నెలో రెండు నుంచి మూడు టీ స్పూన్ల గోరింటాకు పొడిని తీసుకోవాలి. అదే విధంగా రెండు టీ స్పూన్ల ఉసిరి పొడిని కూడా తీసుకుని రెండింటీనీ బాగా కలపాలి. తరువాత ఈ పేస్ట్ ను మూడు నుంచి నాలుగు గంటల పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి.

హెన్నా -ఉసిరి మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఒకటి నుంచి రెండు గంటల పాటు వదిలేయాలి. ఆ తరువాత జుట్టను గాఢత తక్కువగా ఉన్న షాంపూతో కడగాలి. ఈ విధంగా తరచూ చేయడం వలన జుట్టు మంచి రంగును పొందడంతో పాటు ఆరోగ్యంగా మారుతుంది. ఈ ప్యాక్ ను రెండు వారాలకు ఒకసారి జుట్టుకు అప్లై చేయాలని సూచిస్తున్నారు.

Tags