https://oktelugu.com/

Photo Story: దేవత గెటప్ లో మెస్మరైజ్ చేస్తున్న ఈ నటి స్టార్ యాంకర్ కమ్ యాక్టర్? మీకు బాగా తెలిసిన ఫేస్!

కెరీర్ ప్రారంభదశలో చిన్నా చితక పాత్రలు చేస్తూ మెల్లగా నిలదొక్కుకుని ఒక గొప్ప స్థాయికి చేరుకుంది. యాంకర్ గా పాపులర్ అయిన ఆమె నటిగా కూడా సత్తా చాటింది. ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు.

Written By:
  • S Reddy
  • , Updated On : June 8, 2024 / 06:38 PM IST

    Photo Story

    Follow us on

    Photo Story: సినిమా ఇండస్ట్రీలో ఎదగాలని, స్టార్ గా వెండితెరను ఏలాలని చాలామంది కలలు కంటారు. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి కూడా అలాగే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కెరీర్ ప్రారంభదశలో చిన్నా చితక పాత్రలు చేస్తూ మెల్లగా నిలదొక్కుకుని ఒక గొప్ప స్థాయికి చేరుకుంది. యాంకర్ గా పాపులర్ అయిన ఆమె నటిగా కూడా సత్తా చాటింది. ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు.

    ఆమె ఎవరో కాదు నటి అనిత చౌదరి. చిన్నప్పటి నుంచే సినిమాల్లో రాణించాలని కోరికతో అనిత చౌదరి పరిశ్రమలో అడుగు పెట్టింది. అందుకోసం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా డాన్స్ స్కూల్ లో కూడా చేరిందట. మొదటగా ఓ టెలీఫిల్మ్ లో అవకాశం వచ్చిందట. కానీ అది టెలికాస్ట్ కాలేదట. అయితే అనితకు తెలియకుండా ఆమె ఫ్రెండ్స్ ఈటీవి ఛానల్ వారికి ఫోటోలు పంపించారట. అలా యాంకర్ గా ఆమె కెరీర్ మొదలైంది.

    ఆ తర్వాత సీరియల్ నటిగా అనిత మంచి గుర్తింపు తెచ్చుకుంది. కస్తూరి, ఋతురాగం, అమృతం వంటి సీరియల్స్ లో నటించింది. కస్తూరి సీరియల్ కి గాను వరుసగా ఏడు సంవత్సరాలు ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. అనిత చౌదరి మంచి డాన్సర్ కూడా. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. తరుణ్ హీరోగా నటించిన నువ్వు నేను సినిమాలో రేచీకటి ఉన్న మహిళ పాత్రలో కనిపించింది.

    అలాగే రాజమౌళి ఛత్రపతి మూవీలో ‘ సూరీడు .. సూరీడు’ అంటూ ఆమె చెప్పిన డైలాగ్ చాలా ఫేమస్. ఇప్పటికి కూడా కొందరు సోషల్ మీడియాలో మీమ్స్ కి వాడుతుంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే దాదాపు 50 చిత్రాల్లో నటించి మెప్పించారు. సంతోషం , ఛత్రపతి, కేరింత, మన్మధుడు, గురు, రారండోయ్ వేడుక చూద్దాం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.