https://oktelugu.com/

Apples : యాపిల్స్ ఆరోగ్యానికి మంచిదే.. అలా అని ఎక్కువగా తినడం ప్రమాదమే!

అలాగే పొట్ట సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే మలబద్దకం, గుండె సమస్యలు, రక్తహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. వీటితో పాటు రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి రోజు ఒకటి లేదా రెండు యాపిల్స్ మాత్రమే తినండి. అంతకంటే ఎక్కువగా తింటే మీకు అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 21, 2024 / 07:01 AM IST

    Apples are good for health

    Follow us on

    Apples : రోజూ ఓ యాపిల్ తింటే డాక్టర్‌తో పనిలేదనే సామెత గురించి తెలిసిందే. యాపిల్స్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, వీటివల్ల మేలు జరుగుతుందని రోజూ వీటిని తింటారు. అయితే యాపిల్స్ వల్ల కేవలం లాభాలు మాత్రమే కాదు.. నష్టాలు కూడా ఉన్నాయి. ఏ పదార్థాలు అయిన మితంగా మాత్రమే తీసుకోవాలి. పరిమితికి మించి ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు తప్పవని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధికంగా యాపిల్ తినడం వల్ల ఏమవుతుందో తెలుసుకుందాం.

    ఆపిల్ పండ్లలో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలా అని అధికంగా తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎక్కువగా యాపిల్స్ తింటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. అలాగే గ్యాస్ట్రిక్, కడుపునొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజుకి 20 నుంచి 40 గ్రాములు ఫైబర్ మాత్రమే అవసరం. అంతకంటే ఎక్కువగా ఫైబర్ తీసుకుంటే కడుపు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. యాపిల్స్‌లో పొటాషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అలాగే జీవక్రియ అనారోగ్యం, మధుమేహం వంటి సమస్యలు కూడా వస్తాయి. యాపిల్స్‌పై కొన్ని రసాయనాలు చల్లుతుంటారు. వీటిలో డిఫెనిలామైన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇలా రసాయనాలు ఉండే యాపిల్స్‌ను తినడం వల్ల అలెర్జీ వస్తుంది.

    యాపిల్స్ వల్ల బరువు ఎక్కువగా పెరుగుతారు. వీటిలో కార్బోహైట్రేట్లు, ఫైబర్ ఉండటం వల్ల శరీరంలో కొవ్వు పరిమాణం పెరుగుతుంది. దీంతో తొందరగా బరువు పెరుగుతారు. ఆపిల్స్‌లో ఎక్కువ ఆమ్లం ఉంటుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల దంత సమస్యలు కూడా వస్తాయి. దంతాల ఆరోగ్యానికి అస్సలు యాపిల్స్ మంచివి కావు. యాపిల్స్ అంత త్వరగా జీర్ణం కావు. ఎక్కువగా భోజనం చేసిన తర్వాత యాపిల్స్‌ను అస్సలు తినకూడదు. కాబట్టి యాపిల్స్‌ను తక్కువగా మాత్రమే తీసుకోండి. రోజుకి దాదాపు రెండు యాపిల్స్ తింటేనే మంచిది. అంతకంటే ఎక్కువగా తింటే అనారోగ్య పాలవుతారు. యాపిల్స్‌ను సాయంత్రం లేదా రాత్రి అస్సలు తినకూడదు. ఈ సమయంలో తింటే ఎసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రిపూట యాపిల్ తినడం మానుకోండి. ఉదయం పూట యాపిల్ తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పొద్దున్నే యాపిల్ తినడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. అలాగే పొట్ట సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే మలబద్దకం, గుండె సమస్యలు, రక్తహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. వీటితో పాటు రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి రోజు ఒకటి లేదా రెండు యాపిల్స్ మాత్రమే తినండి. అంతకంటే ఎక్కువగా తింటే మీకు అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.