After waking up : నిద్రలేచిన తర్వాత ఈ పనులు అస్సలు చేయవద్దు.. చేస్తే అంతే సంగతి ఇక!

మనం చేసే చిన్న తప్పుల వల్ల రోజులో సమస్యలు వస్తాయి. కాబట్టి ఉదయాన్నే కొన్ని తప్పులు అనేవి మనం చేయకూడదు. మరి పొద్దున్న లేచిన వెంటనే పొరపాటున కూడా చేయకూడని ఆ పనులేంటో తెలుసుకుందాం.

Written By: Neelambaram, Updated On : August 20, 2024 6:58 pm

After waking up

Follow us on

After waking up :  రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే పొద్దున్న మీరు చేసే పనులే చాలా ముఖ్యం. ఎందుకంటే ఉదయాన్నే లేచిన వెంటనే ఎంత ఫ్రెష్‌గా ఉంటే రోజంతా అంతా హ్యాపీగా ఉంటారు. అయితే ఉదయం లేచిన వెంటనే మనం చేసే పనుల బట్టే మన డే ఉంటుందని నిపుణులు అంటున్నారు. సాధారణంగా చాలామంది ఉదయం లేచిన తర్వాత అరచేతులను చూసుకుంటారు. మరికొందరు దేవుడిని చూస్తారు. ఎవరికి ఏది అంటే ఇష్టమో వాటిని చూస్తారు. బయటకు వెళ్లిన తర్వాత ఏవైనా పనులు కాకపోతే పొద్దున్న ఎవరి ముఖం చూశానో.. రోజంతా ఇంత దరిద్రంగా ఉందని కొన్నిసార్లు అనుకుంటారు. అయితే మనం చేసే చిన్న తప్పుల వల్ల రోజులో సమస్యలు వస్తాయి. కాబట్టి ఉదయాన్నే కొన్ని తప్పులు అనేవి మనం చేయకూడదు. మరి పొద్దున్న లేచిన వెంటనే పొరపాటున కూడా చేయకూడని ఆ పనులేంటో తెలుసుకుందాం.

చాలామందికి తొందరగానే తెలివి వస్తుంది. దీంతో లేచిన వెంటనే ఆవలించి మళ్లీ పడుకుంటారు. లేచి ఆవలించి మళ్లీ పడుకుంటే రోజంతా డల్‌గా అనిపిస్తుంది. చాలా చిరాకుగా ఉంటుంది. కాబట్టి లేచిన వెంటనే చేతులను చూసి కాలకృత్యాలు మొదలు పెట్టాలి. అంతే కానీ సమయం ఉంది కదా అని మళ్లీ పడుకోకూడదు. ఇలా చేయడం వల్ల మీరు రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఈరోజుల్లో అయితే చాలామంది వాళ్ల డేని మొబైల్‌తో స్టార్ట్ చేస్తారు. లేచిన వెంటనే మొబైల్‌ను చూస్తూ టైమ్ పాస్ చేస్తుంటారు. పొద్దున్న లేచిన వెంటనే మొబైల్ స్క్రీన్ చూడటం మంచిది కాదు. వాటి నుంచి వచ్చే కిరణాలు వల్ల కళ్లు దెబ్బతినడంతో పాటు రోజంతా ఒత్తడిలా అనిపిస్తుంది. కాబట్టి లేచిన వెంటనే మొబైల్‌లో టైమ్‌ పాస్ చేయకండి.

ఉదయం బ్రష్ చేయకుండా కొందరు కనీసం నీరు కూడా తాగరు. అయితే రాత్రి తిన్న తర్వాత పొద్దున్న వరకు ఏం తినకపోవడం వల్ల బాడీ డీ హైడ్రేట్ అవుతుంది. కాబట్టి లేచిన వెంటనే ఒక గ్లాసు నీరు తాగడం చాలా మంచిది. దీనివల్ల మీకు రోజంతా అలసట రాకుండా ఎనర్జీగా ఉంటారు. ఉదయాన్నే కాఫీ, టీతో డేను స్టార్ట్ చేయవద్దు. చాలామంది బెడ్ కాఫీ, టీ తాగుతుంటారు. ఇలా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. వీటికి బదులు నిమ్మరసం తాగితే ఆరోగ్యంగా ఉంటారు. అలాగే రోజంగా యాక్టివ్‌గా ఉంటారు. ఈరోజుల్లో చాలామందికి పెంపుడు జంతువులు ఉంటాయి. లేచిన వెంటనే సరదాకి వాటితో ఆడుకుంటుంటారు. అయితే లేచిన వెంటనే వాటితో టైమ్ పాస్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే డే అంతా మంచిగా ఉండాలంటే.. పొద్దున్నే సగం టైమ్ వేస్ట్ చేయడం అంత మంచిది కాదు. రోజంతా ఏం చేయాలో అని లేచిన వెంటనే ప్లాన్ చేసుకోవడం మంచిది. అలాగే యోగా, మెడిటేషన్ వంటివి చేస్తే రోజంతా మనస్సుకు ఎంతో ఆహ్లాదకంగా ఉంటుంది.