కరోనాతో మరో సంచలన ప్రమాదం వెలుగులోకి..

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఎక్కడో చైనాలోని వూహాన్‌లో పుట్టిన వైరస్‌ గ్రామ స్థాయి వరకు చేరింది. మన దేశంలో అయితే.. లక్షలాది మంది వైరస్‌ బారిన పడుతుండగా.. చనిపోతున్న వారి సంఖ్య కూడా లక్షకు చేరువలో ఉంది. ఇక ఈ కరోనా ఎప్పుడు ఎవరికి ఎలా అంటుంతుందో తెలియదు. రోజుకో రూపం దాల్చుతున్న వైరస్‌కు మందును కనిపెట్టడంలోనూ ప్రపంచ దేశాలు పగలు రాత్రి కష్టపడుతూనే ఉన్నాయి. కానీ.. ఇంకా ఫలితాలు రావడం లేదు. Also […]

Written By: NARESH, Updated On : September 30, 2020 3:17 pm

caron

Follow us on

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఎక్కడో చైనాలోని వూహాన్‌లో పుట్టిన వైరస్‌ గ్రామ స్థాయి వరకు చేరింది. మన దేశంలో అయితే.. లక్షలాది మంది వైరస్‌ బారిన పడుతుండగా.. చనిపోతున్న వారి సంఖ్య కూడా లక్షకు చేరువలో ఉంది. ఇక ఈ కరోనా ఎప్పుడు ఎవరికి ఎలా అంటుంతుందో తెలియదు. రోజుకో రూపం దాల్చుతున్న వైరస్‌కు మందును కనిపెట్టడంలోనూ ప్రపంచ దేశాలు పగలు రాత్రి కష్టపడుతూనే ఉన్నాయి. కానీ.. ఇంకా ఫలితాలు రావడం లేదు.

Also Read: బుద్ది తక్కువై పవన్ ను నమ్మాం.. పవన్ మూడు పెళ్లిళ్ల మాసికం: నారాయణ

అసలు ఎదుటి వ్యక్తి నుంచి కరోనా ఎలా వ్యాపిస్తుందో అనే అంశంపై పరిశోధకులు ఇంకా అధ్యయనం చేస్తూనే ఉన్నారు. గాలి, బయటి వాతావరణంలో ఉండే చిన్న తుంపర్లతోనూ వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అంటున్నారు.వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ముక్కు చీదడం చేసినప్పుడు లేదా పాటలు పాడటం, అరవడం, మాట్లాడటం, గాలి పీల్చుకోవడం, వదలడం వంటివి చేసినప్పుడు వివిధ సైజుల్లో వెలువడే తుంపర్లు ఏ సైజ్‌లో ఎంత ప్రభావితం చేస్తాయి..? అన్న అంశాలపైనా పరిశోధకులు అధ్యయనం చేశారు.

ఈ క్రమంలో చిన్న సైజు తుంపర్లు, సిగరెట్ పొగ మాదిరిగా వ్యాప్తి చెందే తుంపర్లు కొన్ని గంటలపాటు గాలిలోనే ఉండిపోతాయని నిర్ధారణకు వచ్చారు. ఇవి గది మొత్తం వ్యాపించడంతోపాటు వెలుతురు, గాలి తక్కువగా ఉన్న చోట్ల మరింత అధికం అవుతాయని అంటున్నారు. అంతేకాదు ఈ చిన్న సైజు తుంపర్లు ఆరు అడుగులకు మించి వ్యాపించే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు అన్నారు.

Also Read: విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త.. అక్టోబర్ 5నే ఆ పథకం అమలు..?

అందుకే వ్యక్తుల మధ్య 6 అడుగుల కంటే ఎక్కువగా భౌతిక దూరం ఉంటే మంచిదని వర్జీనియా టెక్ వర్సిటీ పరిశోధకలు లిన్సేమార్ సూచిస్తున్నారు. మీసిల్స్ మాదిరిగా ఇవి వ్యాపిస్తాయని,  ఏరోసొల్స్‌గా పిలవబడే ఈ తుంపర్లు‌ సమీపంలో ఉన్నవారిపై అధిక ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. ప్రాథమిక సూత్రాలు తెలుసుకోకుండా ప్రజలు ఇష్టారీతిన వ్యవహరిస్తుండడంతో వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తున్నట్లుగానే తెలుస్తోంది.