https://oktelugu.com/

బిగ్ బాస్: పాపం అరియానా.. ‘మాస్టార్’ చేతిలో మోసపోయింది..!

తెలుగు రియల్టీ షోలలో ‘బిగ్ బాస్’ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. బుల్లితెరపై ‘బిగ్ బాస్’ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. గత సీజన్ల మాదిరిగానే కరోనా సమయంలోనూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్-4 రెండు వారాలను పూర్తి చేసుకొని మూడోవారంలో కొనసాగుతోంది. Also Read: టాలీవుడ్ పై ఉమ్మేస్తున్నారంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు? 16మంది కంటెస్టెంటులతో ప్రారంభమైన బిగ్ బాస్-4 సీజన్ తొలి నుంచి మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. బిగ్ బాస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 30, 2020 / 02:23 PM IST
    Follow us on

    తెలుగు రియల్టీ షోలలో ‘బిగ్ బాస్’ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. బుల్లితెరపై ‘బిగ్ బాస్’ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. గత సీజన్ల మాదిరిగానే కరోనా సమయంలోనూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్-4 రెండు వారాలను పూర్తి చేసుకొని మూడోవారంలో కొనసాగుతోంది.

    Also Read: టాలీవుడ్ పై ఉమ్మేస్తున్నారంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు?

    16మంది కంటెస్టెంటులతో ప్రారంభమైన బిగ్ బాస్-4 సీజన్ తొలి నుంచి మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఈసారి పెద్దగా సెలబ్రెటీలు ఎవరూ లేకపోవడంతో ప్రేక్షకులు పెదవివిరుస్తున్నారు. అయితే రోజురోజుకు బిగ్ బాస్ పుంజుకుంటోంది. కొత్తకొత్త టాస్కులతో బిగ్ బాస్ అభిమానులను అలరిస్తున్నాడు.

    తాజాగా బిగ్ బాస్-4లో కెప్టెన్సీ టాస్కు జరిగింది. ఇందులో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లకు కాయిన్స్ టాస్క్ ఇచ్చాడు. పై నుంచి కాయిన్లు వేస్తామని.. ఏరుకోవాలని.. ఎవరి వద్ద ఎక్కువ కాయిన్లు ఉంటే వారే కెప్టెన్ అవుతారంటూ బిగ్ బాస్ పేర్కొన్నాడు. ఈ టాస్కులో ఒకరికి కాయిన్లను మరొకరు తెలియకుండా కొట్టేశారు. అయితే అఖిల్-మోనాల్ మాత్రం కలిసి ఆడుతున్నట్లు కన్పించింది. దీంతో అభి.. మీరిద్దరు కలిసి ఆడుతున్నారా.. నీ కాయిన్లు అఖిల్ కు ఇస్తున్నావా? అంటూ మొనాల్ ను ప్రశ్నించడం కన్పించింది.

    అభి.. కుమార్ దాచుకున్న కాయిన్లను దివి ఒక్కటి కూడా లేకుండా ఎత్తుకెళ్లిపోయింది. దీంతో కాయిన్లు నేను తీసుకుంటానంటూ సాయి రాగా రాజశేఖర్ మాస్టర్ కలుగజేసుకొని దివికే సపోర్ట్ చేశాడు. దివి.. సుజాతలు సొసైల్ అందరి కాయిన్లు కొట్టేస్తున్నాడని అనడంతో వారిపై అతడు మండిపడ్డాడు. నీవ్వేం తక్కువ కాదంటూ దివికి చురకలంటించాడు.

    Also Read: బిగ్ బాస్ పై దేవి నాగవల్లి సంచలన ఆరోపణలు

    ఇక రాజశేఖర్ మాస్టర్ కూడా తానేం తక్కువ కాదన్నట్లు అరియానా కాయిన్లను కొట్టేశాడు. అయితే ఇదేమీ తెలియని అరియానా మాస్టర్ దగ్గరికి వెళ్లి తన గోడును వెల్లబోసుకుంది. దీంతో మాస్టర్ అయ్యో.. అంటూ నీ కాయిన్లు నీను ఇస్తానంటూ నటించి ఆమెను బురిడి కొట్టించారు. ఇది చూసిన వారంతా పాపం అరియానా అని ఓ నిట్టుర్పు వదిలారు. ఇక చివర్లో అరియానాకు తానే కాయిన్లు కొట్టేసినట్లు మాస్టర్ చెప్పడం గమనార్హం. కాగా ఈవారం బిగ్ బాస్ నిర్వహించిన కెప్టెన్సీ టాస్కు అందరినీ అలరించినట్లుగానే కన్పిస్తోంది.